దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2.000 దాటింది. గత మూడు రోజుల నుంచి దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఏపీలో ఈరోజు ఉదయం వరకు 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణలో 127 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు మందు కనిపెట్టటానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. చైనా ఇప్పటికే కరోనాకు మందు కనిపెట్టి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. 
 
మరోవైపు కరోనాకు వాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు బ్రిటన్ కు చెందిన బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ ప్రకటన చేసింది. లక్కీ స్ట్రైక్, బెన్సన్ అండ్ హెడ్జెస్ సిగరెట్ లను ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థ పొగాకు మొక్కల నుంచి కరోనాకు మందు కనిపెట్టినట్లు తెలిపింది. తమ కంపెనీ అనుబంధ సంస్థ అయిన కెంటకీ బయో ప్రాసెసింగ్ పొగాకు మొక్కలతో పలు ప్రయోగాలు చేసి కరోనాకు మందు కనిపెట్టడంలో సక్సెస్ అయిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం కరోనా వాక్సిన్ ను జంతువులపై ప్రయోగిస్తున్నామని... అతి త్వరలోనే ప్రభుత్వం అనుమతిస్తే మనుషులపై కూడా ప్రయోగిస్తామని తెలిపారు. తమకు ఈ విషయంలో ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని కంపెనీ పేర్కొంది. ప్రభుత్వం అనుమతిస్తే జూన్ నెల నుంచి ఈ వాక్సిన్ ను ఉత్పత్తి చేయవచ్చని పేర్కొంది. వారానికి 30 లక్షల డోసుల వాక్సిన్ ను ఉత్పత్తి చేయగలమని కంపెనీ ప్రకటన చేసింది. 
 
నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం బీఏటీ లాంటి కంపెనీలతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోకూడదు. కంపెనీ యాజమాన్యం మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థతో తాము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తమ కంపెనీ అమెరికాకు చెందిన ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ ను, బ్రిటన్‌కు చెందిన ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ సోషల్‌ కేర్‌’ను సంప్రదించినట్లు ప్రకటన చేసింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: