కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మధ్యతరగతి జీవులకు ఊరట కలిగించేలా ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేస్తూ వెసులుబాటు కల్పించారు. గురువారం నిర్వహిం‍చిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు ఆమె మట్లాడుతూ.. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆకస్మాత్తుగా లాక్‌డౌన్‌ విధించడం వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

 

లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక.. ఆదాయ మార్గాలు తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. వీటితో పాటు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ వల్ల నష్టపోతున్న కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను ప్రకటించాలని ఆమె అన్నారు. రైతులకు ముఖ్యమైన పంట కోతలు, కొత్త పంటలు వేసుకునే సమయం కాబట్టి రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి ఆమె సూచించారు. కరోనా వైరస్‌ రోగులను నయం చేసేందుకు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సోనియాగాంధీ కోరారు.

 

వైరస్‌ ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని పరికరాలు, కిట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రయాణానికి ఎలాంటి వాహనాలు లేక.. వలస కూలీలు వందల కొలది కిలోమీటర్లు నడవడం చూస్తుంటే హృదయం తరుక్కుపోతోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘కామన్ మినిమమ్ రిలీఫ్ ప్రోగ్రాం’ ను విడుదల చేయాలని సోనియా డిమాండ్ చేశారు. ఈఎంఐలు వాయిదా వేసినా వడ్డీ రాయితీ మాత్రం ప్రకటించలేదు. వడ్డీ రాయితీ ప్రకటించకపోతే మీరు ఈఎంఐలు వాయిదావేసినా ప్రయోజనం లేదు  అని పేర్కొన్నారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: