కేంద్రం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఆరోగ్య సేతు పేరుతో కేంద్రం కోవిడ్ 19 ట్రాకింగ్ యాప్ ను లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యాప్ ను తయారు చేసింది. మొబైల్ లో ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే కరోనా సోకిన వ్యక్తి మనకు సమీపంలో ఉన్నాడా లేడా అనే విషయం ఈ యాప్ చెబుతుంది. యాప్ కరోనా రోగిని గుర్తిస్తే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. 
 
ఎన్.ఐ.సీ. సూచనల ఆధారంగా నాలుగు రోజుల్లో ఈ యాప్ ను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తయారు చేసింది. ఆరోగ్య సేతు యాప్ నిబంధనల ప్రకారం ఈ యాప్ వినియోగదారుల డేటాను బయటివారితో పంచుకోదు. కేవలం భారత ప్రభుత్వం దగ్గర మాత్రమే యూజర్లకు సంబంధించిన వివరాలు ఉంటాయి. కేంద్రం పేరు, ఫోన్ నంబర్ లాంటి వివరాల విషయంలో గోప్యత పాటిస్తుంది. 
 
అప్లికేషన్ ద్వారా కరోనా సోకిన వ్యక్తిని గుర్తించడమే కాకుండా ఇతర ఉపయోగాలు ఉన్నాయి. ఈ యాప్ లో రాష్ట్రాల వారీగా కరోనా హెల్ప్ లైన్ నంబర్ల సమాచారాన్ని పొందుపరిచారు. ఈ అప్లికేషన్ ను వినియోగించే వారు చాట్ బోట్ ఆప్షన్ ద్వారా కరోనాకు సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాచారం పొందవచ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిరోజూ ఈ యాప్ ద్వారా సలహాలు, సూచనలు యూజర్లకు అందిస్తుంది. 
 
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ  సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సమాచారాన్ని తెలుసుకునే  సదుపాయం ఉంది. యాప్ ను మొబైల్ లో ఇన్‌స్టాల్ చేసుకున్నవారు ఫోన్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా 11 భాషల్లో కరోనాకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఐఓఎస్ ఫోన్లలో కూడా ఈ యాప్ ను ఇన్‌స్టాల్ చేసుకునే సదుపాయం కేంద్రం కల్పించింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: