ఎంతసేపూ ఎదుటివారిపైన చూపు తప్ప తనను తాను సరిదిద్దుకునే ఆలోచన లేని ఆ దేశం ఇపుడు అతి పెద్ద కష్టానికి విలవిలాడుతోంది. ఈ దెబ్బకు దారుణాలే జరిగిపోతాయని కూడా కలవరపడుతోంది. మొత్తానికి మొత్తం చేతులెత్తేసి దేవుడి మీదనే భారం వేసేంది. అక్కడ కరోనా వీర విహారం చేస్తోంది.

 

ఆ దాయాది పాకిస్థాన్. అక్కడ ఇప్పటికి నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులు 2,238 గా ఉంటే మరణాలు 31కి చేరుకున్నాయి. అక్కడ లాక్ డౌన్ అమలులో లేదు, దాంతో కరోనా కేసుల నంబర్లు ఎక్కడ తేలుతాయోయన్ని దేశంలో కంగారు మొదలైంది. పాకిస్థాన్ లో వైద్య సదుపాయాలు జీరో లెవెల్లో ఉంటాయన్న సంగతి తెలిసిందే.

 

అసలే పేద దేశం, ఎటువంటి సదుపాయాలు, నిధులు, అభివ్రుధ్ధి లేదు, పైగా కరోనా వీర విహారం చేస్తోంది. ఈ నేపధ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాక్ డౌన్ ప్రకటించలేమని చెప్పేశారు. ఇప్పటికే అట్టుడుకిన   ఆర్దిక పరిస్థితులతో  భారీ నష్టాన్ని చవిచూస్తున్నామని, లాక్ డౌన్ తో మొత్తం సీన్ సితార్ అవుతుందని ఆయన ఆర్ధిక పరిస్థితులను చెప్పుకొచ్చారు.

 

అయితే లాక్ డౌన్ లేకపోవడంతో  పాక్ లో  కరోనా స్వైర విహారం చేస్తోంది. అందరినీ ఇంట్లో ఉండమని చెబుతున్నా కూడా అక్కడ ప్రజలు పట్టించుకోవడంలేదు. పైగా మసీదులు కూడా తెరచి ఉండడంతో ప్రార్ధనలు కూడా చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఒకరిని ఒకరు అంటుకుంటున్నారు.

 

ఈ మొత్తం పరిణామాలు చూస్తున్న వైద్య నిపుణులు పాకిస్థాన్ ఇపుడు పెను గండంలో పడబోతోదని అంటున్నారు. పాకిస్థాన్ ఇప్పటికైనా కట్టడి చర్యలు తీసుకోకపోతే ప్రపంచంలోనే అతి పెద్ద నంబర్ అక్కడే కరోనా కేసుల రూపంలో కనిపించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న తీరున ఉన్న పాక్ ఇప్పటికీ లాక్ డౌన్ వైపు మొగ్గు చూపడంలేదు. మొత్తానికి దాయాది దేశం ఏ రకమైన  కరోనా దశను చూడనుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: