క‌రోనా వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల‌...ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బంది పాల‌వుతున్నారు. దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతున్నాయి. లాక్‌డౌన్ వంటి ష‌ర‌తుల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య 30 వేలు దాటింది. ఇప్పటిదాకా దాని బారిన పడి 33,523 మంది బలయ్యారు. 20 వేలకు పైగా మరణాలు ఒక్క యూరప్‌లోనే నమోదయ్యాయి. 7,07,312 మందికి వైరస్ సోకగా  1,50,732మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. ఇటలీలో ఇప్పటికే కరోనా మరణాలు పది వేలు దాటిన సంగతి తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో ఓ ఊహించ‌ని ఆఫ‌ర్ తెర‌మీద‌కు వ‌చ్చింది.

 

కరోనా వైరస్ తో తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో ఇటలీ ఒకటి. ఇటలీలో ఇప్పటి వరకు వైరస్ 12,000మందికి సోకగా అందులో దాదాపు 850 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆ దేశంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇటలీలో ఇప్పటిదాకా 50 మంది డాక్టర్లు కరోనాతో చనిపోయినట్టు అక్కడి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్ ఫిలిపో అనేలి ప్రకటించారు. అందులో 17 మంది డాక్టర్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న లొంబార్డి రీజియన్కు చెందిన వారేనని చెప్పారు.

 

క‌రోనా వైరస్ దెబ్బతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు కాలుపెట్టే పరిస్థితి కనబడడం లేదు. అలా అని ఇంట్లో ఇబ్బందిగా ఉండే ప‌రిస్థితి. అయితే వారికి ఫ‌న్ పంచాల‌ని అనుకుందో లేక మ‌రేంటో తెలియ‌దు కానీ..ప్ర‌ముఖ బూతు వీడియోల వైబ్‌సైట్ అయిన  పోర్న్ హబ్ తాజాగా కీల‌క నిర్ణ‌యం వెలువ‌రించింది. వీడియోల‌ను బ‌ట్టి ప్రీమియం సర్వీసులను అందించిన పోర్న్ హబ్ సంస్థలు క‌రోనా స‌మ‌యంలో ఓ నెలరోజుల పాటు ప్రీమియంను ఎత్తేస్తున్నట్లు ప్రకటించాయి. దేశానికి సేవ చేసేందుకు మోడల్‌హబ్ ప్లాట్‌ఫాం నుండి వచ్చే ఆదాయాలన్నింటినీ విరాళంగా ఇస్తున్నట్లు పోర్న్ హబ్ సంస్థ నిర్వహకులు ప్రకటించారు. నెల రోజుల పోర్న్‌హబ్‌ను ఉచితంగా యాక్సెస్ పొందవచ్చంటూ ప్రకటనలో పేర్కొంది. హ‌లో...మీరు ట్రై చేయ‌కండి. మ‌న దేశంలో బూతు బొమ్మ‌ల సైట్ల‌న్నీ ఎప్పుడో బ్యాన్ చేసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: