ఏదైనా కష్టకాలం వస్తే కానీ ఎవరు ఎటువంటి వారో తెలియదు. ప్రస్తుతం కరోనా అనే వైరస్ కారణంగా ప్రజలంతా ఆందోళనతో వణికిపోతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వాలు ,స్వచ్ఛంద సంస్థలు కరోనా వైరస్ పై ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ సమాజాన్ని మేల్కొలుపు తోంది. అదేవిధంగా సమాజంలో చిన్న చూపు చూపుకి గురవుతున్న సెక్స్ వర్కర్లు దీనిపై ప్రజల్లో అవగాహన పెంచే విధంగా నడుం బిగించడం స్ఫూర్తిదాయకంగా కనిపిస్తోంది. తాజాగా తమిళనాడుకు చెందిన కొంతమంది సెక్స్ వర్కర్లు కరోనా పై పోరాటంలో తమ వంతు బాధ్యతను  నిర్వహించడం తో ప్రజల్లో వారిపై మరింత గౌరవం పెంచుతోంది. చెన్నైకి చెందిన ఓ ముప్పై సంవత్సరాల వయసు ఉండే ఓ సెక్స్ వర్కర్ గతంలో తన వద్దకు వచ్చిన విటులు అందరికీ ఫోన్లు చేస్తూ కరొనపై  వారికి సూచనలు చేస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక చేస్తోంది. 

 

అంతేకాకుండా ఈ సమయంలో ఏం చేయాలి ?ఎలా ఉండాలనే విషయం పైన వారికి అవగాహన కల్పిస్తూ తన వంతు బాధ్యతను నిర్వహిస్తోంది. ఈ విధంగా రోజుకు తొమ్మిది, పది ఫోన్ కాల్స్ ను ఆమె విటులకు చేస్తూ వారు వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలి అంటూ జాగ్రత్తలు చెబుతుండడం, వారికి సమాజంపై ఎంత బాధ్యతతో ఉన్నారో గుర్తు చేస్తోంది. అదేవిధంగా తమిళనాడుకు చెందిన మరో సెక్స్ వర్కర్ కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ రకరకాల వీడియోలను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. 

 

వాస్తవంగా వీరిపై సమాజంలో చాలా చిన్న చూపు ఉంటుంది. వీరి కారణంగా సమాజం భ్రష్టు పట్టి పోతుందని, అనేక జబ్బులు వీరి కారణంగానే వస్తాయని సమాజమంతా అవహేళన చేస్తూ చిన్నచూపు చూస్తుంది. కానీ ఇంతటి విపత్తు సమయంలో వీరు తమ వంతు బాధ్యతను నిర్వర్తించడం అభినందించదగ్గ విషయంగా పలువురు కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: