ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు . ఈ క్రమంలో నిత్య్వాసరా సరుకుల కోసం మినహాయించి బయటకు రాకూడదని ఆంక్షలు కూడా విధించింది. ఇక కేంద్రం నిర్ణయాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి.  ఇక తెలంగాణలో లాక్ డౌన్  కాస్త సీరియస్ గానే పాటిస్తున్నారు.  రోడ్లపైకి వస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.  కొన్ని చోట్ల ప్రజలను పోలీసులు  లాఠీలకు పని చెబుతున్నారు.   తాజాగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు రోడ్లపైకి వస్తున్న వారిపై లాఠీలు ఝుళిపించడం పరిపాటిగా మారింది.

 

అయితే వనపర్తిలో కుమారుడితో కలిసి వెళుతున్న ఓ వ్యక్తిపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.  ఇలాంటి పరిస్థితుల వల్ల పోలీసులపై ప్రజలకు అపోహలు ఏర్పడుతాయి.. ఇప్పుడు కరోనా పై పోరాటం చేస్తున్నారు.. ఇలాంటి సమయంలో మంచి పేరు వస్తుంది. ఇలాటి సమయంలో మీరు ఇంత కఠినంగా ఉంటే ప్రజలు భయపడతారని అన్నారు.  ఇలాంటి ఘటనల వల్ల పోలీసు శాఖ మొత్తం అప్రదిష్ఠపాలవుతోందని, మంచి పోలీసులపైనా చెడు ముద్ర పడుతోందని అన్నారు.

 

ఎలాంటి పరిస్థితుల్లోనూ పోలీసులు ప్రజల పట్ల హేయమైన రీతిలో ప్రవర్తించరాదని హితవు పలికారు. వనపర్తి ఘటనపై విచారణ జరిపించాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలకు సూచించారు. వనపర్తిలో కొడుకుతో కలిసి వెళుతున్న వ్యక్తిని పోలీసులు కిందపడేసి చితకబాదగా ఓ యువకుడు ఆ వీడియో కేటీఆర్ కి పంపాడు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: