దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 2,000 దాటగా మృతుల సంఖ్య 50కు చేరింది. గత మూడు రోజుల నుంచి దేశంలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏపీలో ఇప్పటివరకూ 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... తెలంగాణలో 127 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థన సదస్సుకు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా సోకుతున్నట్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారిలో ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో గత నెలలో 14, 15 తేదీలలో జరిగిన ఈ ప్రార్థనలకు మన దేశం నుంచి 7,600, విదేశాల నుంచి 1,300 మంది హాజరయ్యారని సమాచారం. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వీరిలో కొందరిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించాయి. వీరిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. కేంద్రం ఢిల్లీలో జరిగిన ప్రార్థనల వల్ల 9,000 మంది కరోనా భారీన పడే అవకాశం ఉందని చెబుతోంది. వీరిలో ఎంతమందికి కరోనా సోకుతుందో చెప్పలేనప్పటికీ వీరిలో ఎక్కువ మంది కరోనా భారీన పడే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 
 
ఈ ప్రార్థనలకు హాజరైన ప్రతి ఒక్కరిని గుర్తించటానికి కష్ట సాధ్యమైనప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. మర్కజ్ ప్రార్థనలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్న 400 మంది ఇప్పటివరకు కరోనా భారీన పడిన పడినట్లు తెలుస్తోంది. ఏపీలో మర్కజ్ తో సంబంధం ఉన్న 111 మంది కరోనా భారీన పడినట్లు సీఎం జగన్ ప్రకటన చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ప్రార్థనలకు హాజరైన 200 మంది కరోనా భారిన పడినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: