ప్రపంచాన్ని గజ గజ వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చింది. దాంతో వేల మంది మరణించారు.. లక్షల మంది ఈ కరోనా భారిన పడ్డారు.    కరోనా వైరస్ దెబ్బతో చైనా పాఠాలు నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. దేశంలో తొలిసారి షెన్‌జెన్ నగరంలో కుక్కలు, పిల్లుల మాంసం తినడాన్ని నిషేధించింది.  చైనాలోని షెంజన్ నగరం పిల్లులు, కుక్కలు తినడాన్ని నిషేదించింది. కరోనా వైరస్ నేపథ్యంలో సైంటిస్టులకు ఓ అనుమానం వచ్చింది. జంతువుల నుంచే మనుషులకు వచ్చిందా అని భావిస్తున్నారు.

 

ఇప్పటివరకూ చైనాలో బయటపడ్డ ఇన్ఫెక్షన్లన్నీ వూహాన్ లోని గబ్బిలాలు, పాములు వంటి జీవుల నుంచే పుట్టినట్లు బయటపడ్డాయి. 9లక్షల 35వేల మంది వైరస్ బారిన పడితే 47వేల మంది ప్రాణాలు కోల్పోయారు.  దాంతో  కొత్త చట్టం ప్రకారం పిల్లులు, కుక్కలు, పాములు, బల్లులు, రక్షిత వన్యప్రాణులు తినడం నిషేధం. అలాగే, వాటి పెంపకం, విక్రయాలను కూడా నిషేధించినట్టు ప్రభుత్వం పేర్కొంది.  ఈ వ్యాది వ్యాప్తి చెందడానికి  ఆ జంతువుల మాంసం  తినడం కూడా ఒకటన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

 

నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి 1.50 లక్షల యువాన్ల భారీ జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది. ఇక గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్టలు తదితర వాటికి మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు లభించింది. ఈ మేరకు చైనీస్ టెక్నాలజీ హబ్ కుక్కలను, పిల్లులను తినడం మే1 నుంచి నిషేదిస్తున్నట్లు ప్రకటించింది. వూహాన్‌లో జంతువధశాల కేంద్రంగా ప్రాణాంతక  వైరస్ పురుడుపోసుకున్న నేపథ్యంలో తైవాన్, హాంకాంగ్‌లో ఇప్పటికే కుక్కలు, పిల్లుల మాంసంపై నిషేధం అమల్లో ఉంది.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: