క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇదే పేరు మారుమ్రోగుతోంది. చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ అనతి కాలంలోనే ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో అనేక మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. ఇక అమెరికాలో ప్రస్తుతం కరోనా కేసులు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం భార‌త దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2027కి చేరిన‌ట్లు తెలుస్తోంది. వీరిలో 169 మంది కోలుకోగా.. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.

 

ఇక ఇప్పటి వరకూ కోవిడ్ కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి ఢిల్లీలోని మర్కజ్‌కు సంబంధం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక్కడికి వెళ్లొచ్చిన వారిలో చాలా మంది కోవిడ్ బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే.. క‌రోనా ఎఫెక్ట్ ఇండియాలో చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.  కరోనా సంక్షోభకాలంలో  ప్రభుత్వరంగ విమానయాన  సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల ఊబిలో  కూరుకుపోయిన ఎయిరిండియా కరోనా వైరస్ కోరల్లో నానా తంటాలు ప‌డుతోంది. 

 

ఈ నేపథ్యంలో  సుమారు 200 పైలట్ల కాంట్రాక్టులను  తాత్కాలికంగా రద్దు చేసింది.  పదవీ విరమణ తర్వాత తిరిగి ఉద్యోగం పొందిన 200 మంది పైలట్ల  కాంట్రాక్టులను  తాత్కాలికంగా నిలిపివేశామని ఎయిరిండియా  సీనియర్ అధికారి గురువారం తెలిపారు. కాగా, రానున్న మూడు నెలల కాలానికి  క్యాబిన్ సిబ్బంది మినహా అన్ని  ఇతర ఉద్యోగుల జీత భత్యాల్లో 10 శాతం కోతను ఇప్పటికే తగ్గించింది. తాజాగా పైలట్లకు మరో షాక్ ఇచ్చింది. అయితే గత కొన్ని వారాలలో దాదాపు అన్ని విమానాలు నిలిచిపోవడంతో ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని ఎయిరిండియా వెల్ల‌డించింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: