కరోనా రక్కసి కారణంగా ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. ఎప్పడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే కరోనా వైరస్ సోకడం వల్ల మాత్రమే కాకుండా, అది తమకు సోకిందేమోనన్న భయంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది భయపడాల్సిన తరుణం కాదు. ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాల్సిన సమయం. కానీ మన భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అది కాకుండా తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌ లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చేసుకుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి కరోనా సోకిందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.

 

 

వివరాల్లోకి వెళ్తే, ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని సహారాన్‌పూర్‌‌కు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే యూపీలో ఇటీవల కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఆ విషయం తెలుసుకున్న ఆ ఉద్యోగి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల నుండి అతను కుటుంబ సభ్యలెవరితోనూ మాట్లాడటం లేదు. ఎప్పుడూ ఎదో ఒక విషయానికి మధనపడుతూ ఉండేవాడు. అలా అలా డిప్రెషన్ ఎక్కువైపోయి, బుధవారం రోజు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా సోకిందన్న భయంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు ఆ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులు కూడా కరోనా భయంతోనే కొద్దిరోజులుగా అతను డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలను చేస్తోంది. దానిలో భాగంగానే ఈ లాక్ డౌన్ ను అమలు చేసింది. దీని వల్ల ప్రజలు బయటకు రాకుండా, సోషల్ డిస్టెన్సిన్గ్ పాటిస్తూ ధైర్యంగా ఉంటారని ప్రభుత్వం భావించింది. కానీ కొంత మంది ధైర్యం కోల్పోయి ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం చాలా బాధాకరం.

 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: