ఓ వైపు దేశంలో క‌రోనా గంట‌గంట‌కు విజృంభిస్తుండ‌గా..మ‌రోవైపు భార‌త ప్ర‌భుత్వం మాత్రం లాక్‌డౌన్ తేది ముగిశాక తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌ణాళిక‌ను రూపొందించుకుంటోంది. అయితే లాక్‌డౌన్ పొడిగింపు ఉంటుంద‌ని వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేదని ఇప్ప‌టికే కేంద్ర‌మంత్రులు వివ‌ర‌ణ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా భార‌త ప్ర‌భుత్వం తీసుకుంటున్న కొన్ని చ‌ర్య‌లు, నిర్ణ‌యాలు కూడా లాక్‌డౌన్‌ను కొన‌సాగించే ఉద్దేశం లేన‌ట్లుగా స్ప‌ష్టం చేస్తున్నాయి. భారతీయ రైల్వే ఏప్రిల్ 15న సేవల్ని పునరుద్ధరించనుందని ఎకనమిక్ టైమ్స్ కథనం ప్ర‌చురితం చేసింది. అయితే  రైల్వే సేవలు పూర్తి స్థాయిలో కాకుండా క్రమక్రమంగా అందుబాటులోకి తేవాల‌ని కేంద్రం యోచిస్తున్న‌ట్లుగా క‌థ‌నంలో పేర్కొంది.

 

కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా రైల్వే స‌ర్వీసులు నిలిచిపోవ‌డంతో భార‌త‌వ‌ని స్తంభించిపోయింది.  అయితే ఏప్రిల్ 14న  త‌ర్వాత కొన్ని స‌ర్వీసుల‌ను ఆంక్ష‌ల‌తో న‌డిపించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఏప్రిల్ 15 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి వెల్లడించార‌ని ఎక‌న‌మిక్ టైమ్స్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. అయితే లాక్‌డౌన్ పూర్తి కాగానే ప్యాసింజర్ సేవలు ఒక్కసారిగా ప్రారంభం కావని, క్ర‌మంగా పెంచుతూ వ‌స్తార‌ని వార్త‌లో పేర్కొంది. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ముఖ్యమైన పనులు వాయిదా పడ్డా వారు ఇక పూర్తి చేసుకునేందుకు సన్న‌ద్ధమ‌వ్వ‌వ‌చ్చ‌ని తెలిపింది.  ఏప్రిల్ 15న కొన్ని రైళ్లు న‌డిచే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

 
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మార్చి 22 నుంచి మార్చి 31 వరకు ప్యాసింజర్ సేవల్ని నిలిపివేస్తూ ప్రకటన జారీ చేసింది. ఆ త‌ర్వాత  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో చాలామంది దూర ప్రయాణికులు మ‌ధ్య‌లోనే చిక్కుకుని నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇప్పుడు తాజాగా విన‌వ‌స్తున్న వార్త‌ల‌తో అలాంటి వారు ఆనంద‌ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా  నిత్యావసర వస్తువులు, ఇతర సరుకులు, వైద్య పరికరాలను రవాణా చేసేందుకు గూడ్స్ రైళ్లను ఎప్పట్లాగే నడుపుతున్న విష‌యం తెలిసిందే. రోజుకు 9,000 గూడ్స్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: