కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తీవ్రంగా కష్టపడుతుంది. రాష్ట్రంలో అసలు కరోనా ప్రభావం లేదని భావించినా సరే అది ఊహించని విధంగా వ్యాపించడం తో జగన్ లో ఆందోళన మొదలయింది. దీనితో జగన్ ఇప్పుడు వరుసగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడి చేసే విషయంలో ఇప్పుడు కఠిన చర్యలు అనేది చాలా అవసరం. వాటిని చాలా జాగ్రత్తగా జగన్ సమీక్షిస్తూ వాటిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే కరోనా వైరస్ మాత్రం అక్కడ కట్టడి అయ్యే పరిస్థితి లేదు. 

 

దాదాపు అన్ని జిల్లాలకు కరోనా వైరస్ విస్తరించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగా ఉంది. అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీనితో ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అలాగే ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అక్కడ కూడా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 20 కరోనా కేసులు జిల్లాలో ఉన్నాయి. దీనితో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. 

 

తెలంగాణాలో ఎక్కువగా ఉన్నాయి అనుకున్న కేసులు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో పెరగడంతో జగన్ కి ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు. చాలా మంది అధికారులకు కూడా ఇప్పుడు పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది అర్ధం కావడం లేదు. ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో గ్రామీణ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి గ్రామాల్లోకి కరోనా వెళ్ళింది అంటే మాత్రం దాన్ని అదుపు చేయడం సాధ్యం కాదు. కాబట్టి జగన్ ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కరోనా నగర ప్రాంతాలకు మాత్రమే ఇప్పుడు పరిమితం అయి ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: