మన దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ పరిస్థితి ఏంటీ అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఇప్పుడు క్రమంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ ని ఈ నెల 14 వరకు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత దీనిని దశల వారీగా ఎత్తివేయడానికి ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విషయం చెప్పారు. 

 

కరోనా కట్టడి కావాలి అంటే ... అదీ ఇప్పటి పరిస్థితుల్లో కట్టడి కావాలి అంటే మాత్రం కచ్చితంగా లాక్ డౌన్ ని పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కరోనా వైరస్ మన దేశంలో చాపకింద నీరు మాదిరి విస్తరిస్తుంది. ఒక్క రోజులో కరోనా కేసులు దాదాపు 400 వరకు నమోదు కావడం ప్రభుత్వాలను భయపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదు. ఏ మాత్రం ప్రజలు బయటకు వచ్చినా సరే తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం అన్ని విధాలుగా అర్ధమవుతుంది. 

 

కరోనా ను కట్టడి చెయ్యాలి అంటే ప్రజల ప్రాణాలు కాపాడాలి అంటే కచ్చితంగా లాక్ డౌన్ ని మరిన్ని రోజులు అమలు చెయ్యాలి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పరిస్థితులు చాలా ఆందోళనగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అక్కడి ప్రజలు ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటే భయపడే పరిస్థితి చాలా వరకు ఉంది. ఇలాంటి తరుణంలో లాక్ డౌన్ ఎత్తేస్తే కచ్చితంగా వైరస్ కి దారులు తెరిచినట్టే అనే అని అంటున్నారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: