ప్ర‌పంచాన్ని క్ష‌ణాల్లో మార్చేస్తోన్న సోష‌ల్ మీడియా యాప్‌ల‌లో వాట్సాప్ ముందంజ‌లో ఉంటుంది. వాట్సాప్ ప్ర‌తి సారి ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజ‌ర్ల మ‌న‌స్సుల‌ను గెలుచుకుంటోంది. వాట్సాప్ స్టార్ట్ అయ్యాక ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో స‌రికొత్త మార్పులు వ‌చ్చాయి. ప్ర‌తి మార్పు యూజ‌ర్ల‌కు ఎంతో యూజ్ అవుతోంది. తాజాగా వాట్సాప్ మ‌రో అదిరిపోయే ఫీచ‌ర్ వ‌చ్చింది. తరచూ ఫోన్లు మార్చేవారికి వాట్సప్ తీసుకొస్తున్న ఈ లేటెస్ట్ ఫీచర్ సూప‌ర్బ్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే అనాలి.

 

ప్ర‌స్తుతం టెస్టింగ్ ద‌శ‌లో ఉన్న ఈ ఫీచ‌ర్‌ను త్వ‌ర‌లోనూ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే బీటా వెర్ష‌న్‌లో ఈ ట్రైల్ వెర్ష‌న్ స‌క్సెస్ కావ‌డంతో ఈ కొత్త ఫీచ‌ర్‌పై అంద‌రిలోనూ న‌మ్మ‌కాలు క‌లిగాయంటున్నారు. ఇటీవలే డార్క్ మోడ్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ ఇలా ఒకే ఫోన్ నెంబర్‌తో వాడే అకౌంట్‌ను పలు ఫోన్లలో ఓపెన్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఈ ఫీచ‌ర్ ను యాండ్రాయిడ్‌, ఐఓఎస్, ట్యాబ్లెట్ ఇలా ఏ డివైజ్ లోనైనా వాడుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఫోన్లలో ఒకే అకౌంట్ ను వాడే ఫీచర్ తో పాటు ఎక్స్‌పైరింగ్ మెసేజ్ ఆప్షన్ కూడా రెడీ అవుతుంది. 

 

ఇక ఈ స‌రికొత్త ఫీచ‌ర్‌తో గ్రూప్ మెసేజింగ్ మాత్ర‌మే కాకుండా ప‌ర్స‌న‌ల్ చాటింగ్ కూడా చేసుకోవ‌చ్చు. ఇక మెసేజ్‌కు ఎక్స్‌ఫైరింగ్ టైం ఫిక్స్  చేస్తే అక్క‌డ సెట్ చేసిన టైం అయిపోయాక అది క‌నిపించ‌కుండా పోతుంది. ఇక ఇటీవ‌లే వాట్సాప్ మ‌రో షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా 30 సెక‌న్ల పాటు ఉండే వాట్సాప్ స్టేట‌స్‌ను ఇప్పుడు 15 సెక‌న్ల‌కే త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. ఇక వాట్సాప్ ప్రారంభించిన‌ప్పుడు స్టేట‌స్ అప్‌లోడ్ చేసే స‌మ‌యం 90 సెక‌న్ల నుంచి 3 నిమిషాల వ‌ర‌కు ఉండేది. ఇప్పుడు అది క్ర‌మంగా త‌గ్గిస్తూ వ‌స్తున్నారు. ఏదేమైనా వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో మిగిలిన సోష‌ల్ మీడియా యాప్‌ల‌ను అస్స‌లు త‌న‌ద‌రిదాపుల్లో లేకుండా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: