కరోనా వైరస్ ని మన దేశ౦ ముందు నుంచే తక్కువగా అంచనా వేస్తూ వస్తుంది అనే విషయం చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ అనేది మనం ఊహించిన దాని కంటే చాలా ప్రమాదకరం అనే విషయం చాలా మందికి అర్ధం కావడం లేదు. కరోనాను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా సరే దాన్ని ఎదుర్కోవడం అనేది చాలా పెద్ద సవాల్. మన దేశం ముందు నుంచి కూడా కరోనా విషయంలో చాలా అలసత్వం ప్రదర్శించింది అంటున్నారు. మన దేశంలోకి కరోనా రాకుండా అడ్డుకోవాల్సిన సమయంలో మన వాళ్ళు తెలివి తక్కువ పనులు చేసారని అంటున్నారు. 

 

అవును మన పాలకులు అంతర్జాతీయ విమానాలను అడ్డుకుని ఉంటే నేడు ఈ స్థాయిలో పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు. చాలా దేశాల్లో తీవ్రత తగ్గడానికి ప్రధాన కారణం ఒకటే. దాన్ని కట్టడి చేయడానికి ఎక్కువగా అంతర్జాతీయ విమానాలను అడ్డుకున్నారు. వ్యాపారాలు ఉన్నా సరే ఎవరూ కూడా ఏదీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నారు. రష్యా సహా కొన్ని దేశాలు ఆర్ధికంగా ఎంత బలంగా ఉన్నా ఎన్ని ఒప్పందాలు విదేశాలతో ఉన్నా సరే వాళ్ళు ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు. చైనా తో ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. 

 

కాని మన దేశం మాత్రం ఏ విధంగాను కరోనా కట్టడి విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ముందు విమానాలతో పాటుగా సరిహద్దులను మూసి వేసి ఉంటే ఈ దరిద్రం ఉండేది కాదని కొందరు హెచ్చరించినా సరే వాళ్ళను పప్పు అంటూ సమయం వృధా చేసారు గాని చర్యలు మాత్రం ఏ ఒక్కటి తీసుకోలేకపోయారు అంటున్నారు. అందుకే నేడు దేశంలో కరోనా ఈ స్థాయిలో ఉందని అంటున్నారు. గ్రామ స్థాయిలో గనుక కరోనా ఒక్కసారి చెలరేగితే దాన్ని అదుపు చేయడం ఎవరి తరం కాదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: