ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. ఈ పేరు వింటే చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని అల్లాడిస్తుంది అనేది అర్ధమవుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే అది మాత్రం మాట వినే పరిస్థితిలో దాదాపుగా లేదు అనేది అర్ధమవుతుంది. కరోనా వైరస్ కోసం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాయి. ఆర్ధికంగా నష్టపోతున్న దేశాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు. 

 

కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గకపోవడానికి దానికి ఉన్న అంటుకునే గుణమే. అయితే ఇంత జరుగుతునా ప్రపంచం మొత్తం నాశనం అవుతున్నా చైనా బుద్ధి మాత్రం మారడం లేదు. కుక్కలు, గబ్బిలాలు, పాముల విక్రయాలను వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కరోనా పాములు గబ్బిలాల నుంచి వచ్చింది అనేది ప్రధాన ఆరోపణ. జంతువుల నుంచి కరోనా వచ్చింది అనే ఆరోపణలు ఎక్కువగానే వస్తున్నాయి. అయినా సరే ఆ దేశం బుద్ధి ఏ విధంగాను మారే పరిస్థితి లేదు అనేది అర్ధమవుతుంది. ఇప్పుడు దీనిపై ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తుంది. 

 

చైనా నుంచి రహస్యంగా కొన్ని ప్రాంతాలకు పాములు, కప్పలు, గబ్బిలాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. దీనితో ఒక్కసారిగా ఆందోళన మొదలయింది. చైనా ఉత్పత్తుల మీద నిషేధం విధించాలి అని ప్రపంచ దేశాలు అన్నీ ఒక నిర్ణయానికి వస్తే మంచిది అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆ దేశం విషయంలో ఇక కఠిన వైఖరి తో లేకపోతే మాత్రం ప్రపంచం చాలా నష్టపోయే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు చైనా ఇంకా తన బుద్ధి మార్చుకోకపోతే మాత్రం ఇక కఠిన ఆంక్షలు తప్పవని కొన్ని దేశాలు పరోక్ష హెచ్చరికలు కూడా చేసాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: