మందు లేని కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఎంతగా వణికించేస్తోందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలోని చిన్నా పెద్దా దేశాలే కాదు చివరకు అగ్రరాజ్యమని  చెప్పుకుని అమెరికా కూడా వైరస్ ను తట్టుకోలేక తల్లకిందులైపోతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో  వైరస్ కు మందు కనుక్కునే విషయంలో ప్రపంచం మొత్తం మీద దాదాపు 50 దేశాల్లోని పరిశోధనా బృందాలు తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. అయితే  యాంటి కరోనా వైరస్ డోస్ అంత తొందరగా తయారయ్యే అవకాశాలు లేవు.

 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం  వైరస్ కు  విరుగుడు కనిపెట్టటానికి తక్కువలో తక్కువ ఏడాదిన్నర కాలం పడుతుందట. మామూలుగా ఏదైనా రోగానికి మందు కనిపెట్టాలంటే పద్దతి ప్రకారం వెళితే  కనీసం పది సంవత్సరాలు పడుతుంది. అలా కాదని ఇపుడు అనుసరిస్తున్న పద్దతులన్నింటినీ పక్కన పెట్టేసినా ఏడాదిన్నర సమయం అయితే తప్పదంటున్నారు. అంటే దీన్నిబట్టి అర్ధమవుతున్నదేమంటే మందు లేని వైరస్ సోకకూడదని అనుకుంటే ఎవరికి వాళ్ళు గా సెల్ఫ్ లాక్ డౌన్ పాటించటమే అని.

 

యాంటి కరోనా వ్యాక్సిన్ తయారు  చేయటంలో అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ,  ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, భారత్, చైనా దేశాలు పోటి పడుతున్నాయి. మందు తయారీకి అవసరమయ్యే నిధులను స్వచ్చంధ సంస్ధలు, ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయి. అయినా కానీ తొందరగా అయితే మందు కనిపెట్టటం సాధ్యంకాదు.  న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఓ కరోనా వైరస్ పేషంట్ కు ఒక వ్యాక్సిన్ ఇచ్చారట. హెచ్ఐవి, సార్స్ వైరస్ ల్లో వాడే మందుల మిశ్రమాన్నే కరోనా రోగి మీద కూడా ప్రయోగించాయట పై దేశాలు.

 

వాషింగ్టన్ నుండి వచ్చిన రోగికి ఇచ్చిన మందు కొద్దిగా పనిచేసిందని పై దేశాల నిపుణులు చెప్పటం కాస్త ఉత్సాహాన్నిచ్చేదే. కాకపోతే అతనికి ఇచ్చిన మందు అందరు రోగులకు పనిచేస్తుందని గ్యారెంటీ లేదు. ఒకరికి పనిచేసిన మందు మరోకళ్ళకు పనిచేయాలని ఏమీ లేదు. అందుకనే వైరస్ క మందు కనిపెట్టేంత వరకూ ఎవరికి వాళ్ళు గా కొంతకాలం లాక్ డౌన్లో ఉండటమే ఎప్పటికీ క్షేమం.

మరింత సమాచారం తెలుసుకోండి: