కరోనా విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో రోజుకు కొన్ని వేల సార్లు చెవులకు వినిపించేలా ప్రచారాలు సాగుతున్నాయి.. కళ్లముందు మరణాలు సంభవిస్తున్నా, కరోనా సోకిన వారు కాకుల్లా రాలిపోతున్న కొందరు మాత్రం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు.. తనకు వచ్చిన కరోనా వైరస్ తనవల్ల ఇతరులకు సోకకుండా అసలు జాగ్రత్త పడటం లేదు.. ఇలాంటి వారివల్లే ఇప్పుడు ప్రపంచం అంతా ఈ వ్యాధి విస్తరించి, జన జీవనం అస్తవ్యస్తంగా మారింది..

 

 

ఇకపోతే ఒక వ్యక్తి తాను తండ్రి అవుతున్నాననే సంతోషంలో, తనకు ఉన్న కరోనాను దాచిపెట్టి, తన భార్య డెలివరి అయ్యే హస్పిటల్‌కు వెళ్లాడు.. తనకు కరోనా ఉందని చెబితే ఎక్కడ తనను క్వారంటైన్‌కు తరలించి తన బిడ్డను చూడకుండా చేస్తారో అనే భయంతో మూర్ఖంగా ప్రవర్తించాడు.. ఈ నిర్లక్ష్యం ఫలితంగా మరింతమందికి ఈ వైరస్ వ్యాపింపచేసాడు.. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లోని రాచెస్టర్ నగరంలో ఉన్న స్ట్రాంగ్ మెమోరియల్ ఆసుపత్రిలో గర్భవతిగా ఉన్న ఒక మహిళ డెలివరీ కోసమని చేరింది. సరిగ్గా ఇదే సమయంలో ఆ గర్భవతి భర్తకు కరోనా సోకింది. అతడికి ఈ విషయం తెలిసినప్పటికి అధికారులకు చెప్పలేదు సరికదా.. తన భార్య చేరిన ఆసుపత్రి మొత్తం తిరిగేశాడు. అప్పటికి అనుమానంతో ఆసుపత్రి సిబ్బంది ప్రశ్నించినప్పటికి, తనకు కరోనా సోకలేదని, చెప్పుకొచ్చాడు.

 

 

అయితే ఈ వైరస్ దాచితే దాగడానికి ధనం కాదుగా కరోనా.. అందుకే వెంటనే తన ప్రతాపం చూపించింది.. బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే అతని భార్యకు కరోనా లక్షణాలు రావడం మొదలయ్యాయి. వైద్యులు పరీక్షలు చేయగా.. మహిళ, ఆమెకు పుట్టిన బిడ్డకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అనుమానం వచ్చిన వైద్యులు ఆమె భర్తను ప్రశ్నించగా చావుకబురు చల్లగా బయటపెట్టాడు. తన భార్య డెలివరీకి ఉండటంతో, కరోనా ఉందని చెబితే పుట్టబోయే బిడ్డను చూడనివ్వరని, అందుకే నిజాన్ని దాచానని వివరించాడు.

 

 

కాగా.. మెటర్నిటీ వార్డులో మహిళతో ఉన్న నర్సుకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ వచ్చినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన తరువాత ఆసుపత్రికి వచ్చిన వారందరికి టెంపరేచర్ టెస్ట్ చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. చూశారా ఒక పనికోసం నిజాన్ని దాచి ఎందరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడో ఈ బుర్రతక్కువ వెధవ అని నెటిజన్స్ తిడుతున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: