ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆటో, టాక్సీ, రిక్షావాలా, గ్రామీణ సేవ డ్రైవర్లకు, ఇంకా ఇతర అందరూ డ్రైవర్ల బ్యాంకు అకౌంట్ల లో ఐదువేల రూపాయలను పది రోజుల్లోపు వేస్తానని తాజాగా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 9 గంటలకు ప్రజలను ఉద్దేశిస్తూ ఓ చిన్న వీడియో సందేశాన్ని విడుదల చేస్తానని సామాజిక మాధ్యమాలలో వెల్లడించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ వీడియో ద్వారా ఏ సందేశాన్ని విలువనిస్తారు అనే అంశం ఆసక్తిగా మారింది. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేస్తాం అని చెప్తారా అని చాలామంది ఊహాగానాలు చేసుకుంటున్నారు.


కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర తోమర్ మాట్లాడుతూ... తిండి గింజలు దొరకాలంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు లాక్ డౌన్ వర్తించదు. మీరు వ్యవసాయ పనులు నిర్విరామంగా చేసుకోవచ్చు. అలాగే మీ పంటను అమ్ముకోవచ్చు. కాకపోతే వ్యవసాయ పనులు చేసేటప్పుడు కాస్త భౌతిక దూరాన్ని పాటిస్తే మంచిది', అని ఆయనన్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాన నరేంద్ర మోడీని బాగా కొనియాడారు.


కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు ప్రపంచంలో నరేంద్రమోడీ లాగా ఏ దేశ అధినేత సమర్థవంతమైన చర్యలను చేపట్టలేదని తెగ కొనియాడాడు. కాకపోతే ఇండియాలో ప్రకటించిన లాక్ డౌన్ ప్రపంచ దేశాలన్నింటిలో అత్యంత కిరాతక మైనదిగా మోడీ సడన్ నిర్ణయాన్ని జాతీయ మీడియా ఇప్పటికి విమర్శిస్తోందంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ నేతలు కూడా మోడీ పరిపాలన పై తీవ్ర విమర్శలు చేస్తుండగా... కోవిడ్ 19 మహమ్మారి ప్రజలని గడగడలాడిస్తుంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అమిత్ షా అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బిల్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడతూ... తమ జిల్లాలో 26 కేసులు నమోదు కాగా 8 మంది కోలుకున్నారని తెలిపారు. అయితే ఆ జిల్లా ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని... ప్రతి ఒక్క పేద వారి ఇంటికి వండిన భోజనం అందుతుందని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య ఒక్కసారి చూసుకుంటే...

ప్రపంచలో మొత్తం కేసులు: 955, 453
మరణాలు: 48,579
రికవరీ కేసులు: 203,013

ఇండియాలో మొత్తం కేసులు: 2121
మరణాలు: 58
కొత్త కేసులు: 115
రికవరీ కేసులు: 148

తెలంగాణలో మొత్తం కేసులు: 133
యాక్టివ్ కేసులు: 103
మృతులు: 9
ఏపీలో మొత్తం కేసులు: 143
మృతులు: 0

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
గుంటూరు: 20
నెల్లూరు: 21
ప్రకాశం: 17
కృష్ణా: 23
కడప: 16
పశ్చిమ గోదావరి: 14
విశాఖపట్నం: 11
తూర్పు గోదావరి: 9
చిత్తూరు: 9
అనంతపురం: 2
కర్నూలు: 1


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: