ఈ రోజుల్లో ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలీదు. ఒక్కోసారి హఠాత్తుగా ఏమైనా జరిగితే, సమయానికి చేతిలో సరిపడా డబ్బు ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే మార్కెట్‌లో చాలా రకాల హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్నిటి ధరలు అధికంగానే ఉంటాయి. మధ్య తరగతి వారికి ఇది ఒక ఇబ్బందనే చెప్పవచ్చు. అలా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం, తాజాగా ఒక కొత్త పాలసీని కనుగొన్నారు. తక్కువ ధరలో, ముఖ్యమైన వైద్య సేవలతో ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI 'ఆరోగ్య సంజీవని పాలసీ' పేరుతో స్టాండర్డ్ హెల్త్ కవర్ పాలసీని రూపొందించింది.

 

 

ఇప్పటికే భారతదేశంలోని 29 ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ ఏప్రిల్ 1న ఆరోగ్య సంజీవని పాలసీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నట్లుగానే మణిపాల్‌ సిగ్నా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఈ ఆరోగ్య సంజీవని పాలసీని ప్రకటించింది. ఇక ఇతర కంపెనీలు కూడా ఈ పాలసీని ప్రారంభించాల్సి ఉంది. మణిపాల్‌ సిగ్నా వారి ఆరోగ్య సంజీవని పాలసీలో రూ.1 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్  కవర్ అవుతుంది. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ కుటుంబ సభ్యులు కలిపి ఈ పాలసీ తీసుకుంటే 15 శాతం డిస్కౌంట్ ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది . అదనంగా ఆన్‌లైన్ రెన్యువల్ డిస్కౌంట్ ఏడాదికి 3 శాతం లభించనుంది. కవిడ్-19 లాంటి ఇన్ఫెక్షన్ వ్యాధులకు కూడా ఈ పాలసీ వర్తించడం విశేషం. ఆధునిక చికిత్సలు, వైద్య ప్రక్రియలు దాదాపుగా అన్నీ ఈ పాలసీలో కవర్ అవుతాయి. ప్రీహాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్, ఆయుష్ ట్రీట్మెంట్ కూడా ఈ పాలసీలో ఉన్నాయి. మరి మిగిలిన ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా ఇలాగే ప్రకటిస్తారో లేక ఏమైనా మార్పులు చేస్తారో చూడాలి మరి.

 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: