ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. చాప కింద నీరులా కరోన పాకుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు మొత్తం 143 కేసులు నమోదు కాగా రెండు రోజుల వ్యవధిలో 120కేసులు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. కృష్ణా జిల్లాలో 8 కేసులు నమోదు అయ్యాయి ఈ ఒక్క రోజే. కడప, చిత్తూరు, నెల్లూరులో ఒక్కో కేసు నమోదు అయింది. వీరు అందరూ ఢిల్లీ మర్కాజ్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారిగా గుర్తించారు. 

 

కరోనా కేసులు మరింతగా పెరగడంతో ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్న ప్రభుత్వంలో అలజడి మొదలయింది. 9 గంటల వ్యవధిలో 11 కేసులు నమోదు కావడం అత్యధికంగా కృష్ణా జిల్లాలో నమోదు కావడంతో జిల్లా వాసుల్లో ఒక్కసారిగా భయం మొదలయింది. రాయలసీమ జిల్లాల్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచే కేసులు బయటపడుతున్నాయి. 

 

మరికొంత మందిని పరిక్షలు చెయ్యాల్సి ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ విషయం పేర్కొంది. దీనితో ప్రభుత్వం కంగారు పడుతుంది. ఇప్పటికే జగన్ కేంద్రం సాయాన్ని కోరారు. కేంద్రం తమను ఆర్ధికంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు. మూడు రోజుల వరకు 23 మాత్రమే ఉన్న కేసులు ఒక్కసారిగా 120 కి పైగా పెరిగాయి కేసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: