ఒకవైపు రాజకీయాలు వద్దంటూనే మరోవైపు రాజకీయాలు చేయటం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకే చెల్లింది. అదికూడా యావత్ రాష్ట్రయంత్రాంగం మొత్తం కరోనా వైరస్ నియంత్రణ విషయంలో నానా అవస్తలు పడుతుంటే చంద్రబాబు మాత్రం లేనిపోని అనుమానాలను వ్యక్తంచేసి లేఖారాజకీయాలు మొదలుపెట్టాడు. ఇంతకీ చంద్రబాబు ఏమంటాడంటే కరోనా పాజిటివ్ కేసులను  ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందనే ప్రచారం జరుగుతోందట. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కూడా బయట ప్రచారం జరుగుతోందని జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో ప్రస్తావించాడంటే ఏమి చెప్పాలి.

 

అలాగే కరోనా వైరస్ అంశాన్ని జగన్ చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు ఆరోపించాడు. ప్రతిరోజు జగన్ పై చంద్రబాబు మొదటినుండి ఇదే ఆరోపణ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  ఇక్కడ చంద్రబాబు ఉద్దేశ్యమేమిటంటే  జగన్ చేతకాని తనం వల్లే వైరస్ రాష్ట్రంలో పెరిగిపోతోందని చెప్పి జనాలను రెచ్చగొట్టడమే.  

 

పైగా కరోనా నియంత్రణను సవాలుగా తీసుకుని పనిచేయాలని జగన్ కు సలహా కూడా ఇచ్చాడు. జగన్ అయినా యంత్రాంగమైన కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టే ఇన్నిరోజులు వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉంది. కాకపోతే ఢిల్లీలోని మత ప్రార్ధనలకు హాజరై తిరిగి వచ్చిన వారి వల్లే కేసులు ఒక్కసారిగా పెరిగిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇక ల్యాబులు ఎక్కువగా పెంచి అందరికీ పరీక్షలు చేయాలని డిమాండ్ చేయటం కూడా విచిత్రంగానే ఉంది. ఎందుకంటే చంద్రబాబు లేఖలో డిమాండ్ చేసినట్లుగా అనుకున్నదే తడవుగా ల్యాబుల ఏర్పాటు సాధ్యమేనా ? వైద్య పరికరాలుండాలి, పరీక్షలు చేయటానికి నిపుణులు దొరకలి కదా ? ఈ విషయం కూడా చంద్రబాబుకు తెలీదా ?

 

చివరగా ఉద్యోగులకు జీతాల్లో కోత విధించటం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశాడు. జీతాల కోత విషయంలో జగన్ కు ఉద్యోగులకు లేని అభ్యంతరం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు ఎందుకు ? అధికారంలో ఉన్నంత కాలం ఉద్యోగులను రాచి రంపాన పెట్టి ఇపుడు వాళ్ళపై ప్రేమ ఒలకబోస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: