ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? కరోనా వైరస్ పాల ప్యాకెట్ల ద్వారా వస్తుందా? అసలు బుద్ధి ఉందా? అని మీరు అనుకోవచ్చు. కానీ అది వైరస్.. ఎలా అయినా వస్తుంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన 9 లక్షలమందికిపైగా పడ్డారు. అందులో 48వేలమంది మృత్యువాత పడ్డారు. 

 

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను కూడా అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడంతో కేంద్ర ప్రభుత్వం ముందుగానే దేశవ్యాప్తంగా 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే కంటికి కనిపించని ఈ వైరస్ ఒంట్లోకి అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. 

 

అయితే తాజాగా ఓ షాకింగ్ సమాచారం తెలిసింది. ఈ సమాచారం ప్రకారం కరోనా వైరస్ పాల ప్యాకెట్ ద్వారా కూడా వ్యాపిస్తుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వారు పాల ప్యాకెట్లను ముట్టుకుంటే అది ప్లాస్టిక్ తో తయారై ఉంటుంది కాబట్టి 72 గంటల వరకు వైరస్ దానిపై ఉంటుందట. కాబట్టి పాల ప్యాకెట్ ను వాడే ముందు దానిని శానిటైజర్ ద్వారా కడిగి పాలు గిన్నెలో పోసుకొని ఖాళీ ప్యాకెట్ ను బయట పడేయడం మంచిది. అటు విడిగా పాలు పోసుకునే ముందు కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. చూశారుగా.. ఎటు చుసిన కరోనా వైరసే కనిపిస్తుంది. అందుకే లాక్ డౌన్ విధించిన ఈ సమయంలో ఎవరు బయటకు రాకపోవడమే మంచిది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: