ప్రపంచంలో ఏ దుర్మూహూర్తంలో కరోనా వైరస్ వచ్చిందో కానీ ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి కరోనా మహమ్మారి ప్రపంచంలో 195 దేశాలకు వ్యాప్తి చెందింది.  ఈ కరోనా వల్ల దేశంలో కూడా ప్రజలకు మనశ్శాంతి కరువైది.  దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా రోజు రోజుకీ కొన్ని కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.  తెలంగాణలో హాట్ స్పాట్ లను గుర్తించారు. నిజామాబాద్, గద్వాల, నిర్మల్, భైంసా, ములుగు, వరంగల్, మిర్యాలగూడ, పాతబస్తీ వంటి ప్రాంతాలను హాట్ స్పాట్ లు గా గుర్తించారు. రోజురోజుకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

 

ప్రధానంగా నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని భావించిన ప్రభుత్వం హాట్ స్పాట్ లను గుర్తించింది. వీరి ద్వారా ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో గుర్తించే పనిలో పడింది. హాట్ స్పాట్ గా గుర్తించిన ప్రాంతాల్లో నిబంధనలను కఠినంగా అమలుపర్చనున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఉదాసీనంగా వ్యవహారించవద్దని  రాష్ట్ర ముఖ్యమంత్రులు సూచిస్తున్నారు.  నేడు ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

 

ఎవరికి దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు తీవ్రస్థాయిలో అనిపిస్తే, కనిపించినా వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించాలని, వారికి వైద్య పరీక్షలు చేయాలని సూచిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఉద్ధృతమవుతోంది. తాజాగా మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 135కి చేరింది. కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు, కడపలో కూడా కరోనా నిర్ధారణ ల్యాబ్ లు ఏర్పాటు చేశారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: