ఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈరోజు సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే 11 కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈరోజు నమోదైన కేసుల్లో కృష్ణా జిల్లాలో 8 కేసులు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ కు లేఖ రాశారు.  
 
చంద్రబాబు లేఖలో ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం నిరంతరాయంగా కృషి చేయాలని అన్నారు. కరోనా అంశాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందని... కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని సూచించారు. రాష్ట్రంలో వైరస్ వేగంగా విజృంభిస్తోందని... కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని... ప్రభుత్వం సవాల్ గా తీసుకుని కరోనాను నివారించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పాజిటివ్ కేసులను దాచి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోందని అన్నారు. 
 
ప్రభుత్వం నిజాలను దాచిపెడితే మంచిది కాదని సూచించారు. రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారందరికీ పరీక్షలు జరపాలని... రాష్ట్రంలో ల్యాబ్ ల సంఖ్య పెంచాలని చెప్పారు.  ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చిన వారి విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్త వహించాలని... వారికి, వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు జరపాలని సూచించారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పారు. 
 
ప్రభుత్వం రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తెరచి పేదలకు ఆహారం అందించాలని అన్నారు. ప్రభుత్వం రేషన్ పేరుతో జనాలు ఒకే చోట గుమికూడేలా చేస్తుందని ... ఇళ్లకే రేషన్ పంపిణీ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ పూర్తి జీతాలు ఇవ్వాలని... కోత విధించడం మంచి పద్ధతి కాదని చెప్పారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: