అంతు చిక్కని రోగాలు వచ్చి జనాలు చచ్చిపోతున్న, వారితో సెల్ఫీలు దిగడం, టిక్‌టాక్‌లు చేయడం మానడం లేదు కొందరు.. ప్రతి మనిషికి మెదడులో చిన్నపురుగు ఉంటుందంటారు అది కదిలినప్పుడల్లా వింత వింత చేష్టలకు పాల్పడతాడని పెద్దలు అంటారు.. ఇకపోతే లోకంలో ఏదైన జరగని, ప్రపంచం ఏమైన కానీ మా తీరు ఇంతే అని వింతగా ప్రవర్తించే వారు కూడా ఉంటారు.. అదీగాక కొందరు జనాలైతే ట్రెండ్‌ను ఫాలో కావడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ ట్రెండ్‌ను ఫాలో కావడం కొంతవరకు ఓకే కానీ మరీ దీన్ని పిచ్చిగా మార్చుకుంటే అందరు నవ్వుతారు..

 

 

ఇకపోతే ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో కూడా కరోనా వైరస్‌ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది.. దీంతో దేశవ్యాప్తంగా కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో అన్ని రాష్ట్రాల్లోనూ ‘లాక్‌డౌన్‌’ అమలవుతోంది. దీంతో ప్రజలంతా బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇదిలా ఉండగా ఈ కరోనా వైరస్ సోకిన వారు భయంతో కూడిన బాధతో అల్లాడిపోతుంటే.. మరికొందరు కరోనా పేరుతో నవ్వులు పూయిస్తున్నారు.. ఈ వైరస్ పేరును విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇప్పటికే పాటల రూపంలో, టిక్‌టాక్‌ రూపంలో కరోనా కత్రినాకైఫ్‌లా  పబ్లిసిటీ సాధిస్తుంది.. ఇక అసలు విషయం ఏంటంటే ఒక ఇద్దరు జంటలు తమకు పుట్టిన పిల్లలకు ‘లాక్ డౌన్’ కరోనా.. అనే పేర్లను పెట్టుకున్నారు ఇది ఆశ్చర్యాన్ని కలిగించినా నిజం..

 

 

ఇక ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని డోరియా జిల్లాలో ఖుఖుంద్‌ గ్రామంలో పుట్టిన మగ శిశువుకు తల్లిదండ్రులు ‘లాక్‌డౌన్‌’ అని పేరు పెట్టారు. ఈ పేరు ఎందుకు పెట్టారని కొందరు ప్రశ్నించగా, ఆ శిశువు తండ్రి పవన్ మాట్లాడుతూ.. ‘కరోనా’ సందర్భంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో నా బిడ్డ పుట్టాడు. లాక్‌డౌన్‌ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. ప్రజల బాగోగుల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ నా బిడ్డకు ‘లాక్ డౌన్’ అని పేరు పెట్టాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

 

 

ఇదిలా ఉండగా ఇదే రాష్ట్రంలో గోరక్‌పూర్‌ జిల్లా, సాహ్గోరా గ్రామంలో పుట్టిన ఓ ఆడ బిడ్డకు ‘కరోనా’ అని పేరు పెట్టారు. వారు కూడా ఈ పేరు విషయంలో వివరణ ఇస్తూ, కరోనాపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ముందు ముందు అందమైన పేర్లు మాయం అయ్యి ఇలాంటి వింత వింత పేర్లు  పుట్టుకొస్తాయి కావచ్చు అనుకుంటున్నారు పెద్దలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: