కరోనా మహమ్మారి ఏపీలో విజృంభిస్తున్న వేళ, ప్రతిపక్ష టీడీపీ కూడా రాజకీయం చేయడం మొదలుపెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు...తాను రాజకీయం మాట్లాడటం లేదంటూనే, రాజకీయం చేసేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటూ ఓ వైపు ప్రజలకు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండమని చెబుతూనే, మరోవైపు ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ సలహాలు ఇచ్చేప్పుడు తాను రాజకీయం గురించి మాట్లాడటం లేదని చెబుతున్నారు. కానీ కాస్త లోతుగా చూస్తే, బాబు, జగన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు.

 

తాజాగా కూడా ఆయన హైదరాబాద్‌లో ఉండి జగన్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో బాబు కొన్ని కీలక విషయాలు చెబుతూనే లాజిక్ లేని విమర్శలు కూడా చేశారు. మొదట ఏపీలో కేసులు పెరిగిపోయాయని, కరోనా నివారణను సవాల్‌గా తీసుకుని పనిచేయాలని జగన్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. అలాగే ఉపాధి కోల్పోయిన పేదలు పస్తులు ఉండకుండా అన్న క్యాంటీన్లు తెరిచి వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు.

 

అదేవిధంగా ఏపీలో ల్యాబ్‌లు పెంచి, ఎక్కువ పరీక్షలు చేయాలని, కరోనా కేసులు పెరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడ వరకు సలహాలు ఇవ్వడం బాగానే ఉంది గానీ, తర్వాత మాత్రం ప్రభుత్వం పాజిటివ్ కేసులను దాచిపెడుతున్నారన్న ప్రచారం ఉందని, స్థానిక వాస్తవాలను తొక్కిపెట్టడం మంచిదికాదని హితవుపలికారు. అయితే ఈ విధంగా దాచిపెట్టడం జగన్ ప్రభుత్వానికి ఏమైనా సరదానా.. కరోనా కేసులు దాచిపెట్టడం వల్ల జగన్‌కు ఏం వస్తుంది?  అసలు కరోనా అనేది దాస్తే దాగేదా? అసలు సాధ్యం కాని పని కాబట్టి జగన్ ప్రభుత్వం ఇంతవరకు కరోనా కేసులు దాచిన దాఖలాలు లేవు.

 

పైగా దాచిన ఇంకా ఎక్కువే నష్టమే జరుగుతుంది కాబట్టి, జగన్ ప్రభుత్వం అలాంటి పని చేయదు. అలాగే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సరికాదని చంద్రబాబు మరో నీతి వాక్యం చెప్పారు. ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితుల్లో వేతనాల్లో కోత విధించకపోతే రాష్ట్రం ఇంకా నష్టపోతుంది.  

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: