దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనాకు మందు కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చైనా దేశంలో ఇప్పటికే కరోనాకు మందు కనిపెట్టగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మన దేశంలో కరోనా భారీన పడి ఇప్పటివరకూ 58 మంది మృతి చెందారు. 
 
హోమియో వైద్యులు కరోనాను తగ్గించడం సాధ్యమే అని చెబుతున్నారు. వందేళ్ల క్రితం ప్రజలు వైరస్ భారీన పడితే హోమియో వైద్యం ద్వారా నయమైందని... హోమియో అమ్ములపొదిలో కరోనాకు చెక్ పెట్టే ఆయుధం ఉందని చెబుతున్నారు. ఒంగోలుకు చెందిన హోమియోపతి ప్రాక్టీషనర్ చంద్రశేఖర్ శర్మ మీడియాతో ఈ విషయాలను తెలిపారు. "కాంఫోరా" అనే ఔషధం సహాయంతో కరోనాను నయం చేయవచ్చని చెప్పారు. 
 
దాదాపు 300 ఏళ్ల క్రితం రష్యా దేశంలోని సైబీరియాలో ఇన్‌ఫ్లూయంజా, వందేళ్ల క్రితం స్పెయిన్ లో స్పానిష్ ఇన్‌ఫ్లూయంజా పేరుతో ప్రపంచాన్ని వైరస్ లు గడగడలాడించాయని అన్నారు. కాంఫోరా వైరస్ సహాయంతో ఆ వ్యాధులు నయమయ్యాయని... కరోనాకు కాంఫోరాను ఉపయోగిస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని పేర్కొన్నారు. 
 
హోమియోపతి పితామహుడు శామ్యూల్‌ హానిమాన్‌ కొన్ని వందల సంవత్సరాల క్రితం కాంఫోరాను కనిపెట్టారని... మనుషులను వైరల్ వ్యాధుల నుంచి కాపాడటంలో ఈ ఔషధం అద్భుత సంజీవనిలా పని చేస్తుందని పేర్కొన్నారు. వైరస్ సోకక ముందే కాంఫోరాను వినియోగిస్తే వైరస్ భారీన పడమని ఘంటాపథంగా చెబుతున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణలో గత మూడు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 143కు చేరగా తెలంగాణలో 127 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోని సంగారెడ్డిలో కొత్త కేసులు నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నా వైద్య, ఆరోగ్య శాఖ ధృవీకరించాల్సి ఉంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 



 

మరింత సమాచారం తెలుసుకోండి: