ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎలా వ్యాపిస్తుంది? అది వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఇక వైరస్ మనిషి ప్రాణాలు ఎలా కోల్పోయేలా చేస్తుంది? అనే విషయాలపై ప్రజలకు దాదాపు అవగాహన ఉంది. మీడియా, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ప్రతిరోజూ ఈ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు. ఇక ఈ కరోనా వ్యాప్తి పెరగకుండా దేశంలో లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఎమర్జన్సీ సేవలు, మిగతా సేవలు నిలిచిపోయాయి. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది.

 

ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తికి చూయింగ్ గమ్ కూడా కారణమవుతుందని హర్యానా రాష్ట్రం గుర్తించింది. కరోనా ఉన్న వ్యక్తి చూయింగ్ గమ్ నమలడం ఉమ్మేయడం వల్ల, వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. దీంతో ఇదే విషయంపై హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చూయింగ్ గమ్‌ల అమ్మకాలపై నిషేధం విధించింది. జూన్ 30 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని హర్యానా ప్రభుత్వం తెలిపింది.

 

అయితే కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక చూయింగ్ గమ్‌తో పాటు, పాన్ మసాలా, గుట్కా, ఖర్రా వంటి ఉత్పత్తులని కూడా 3 నెలల పాటు బ్యాన్ చేశారు. ఇక హర్యానా రాష్ట్రం మాదిరిగానే మిగతా రాష్ట్రాలు కూడా ఈ చూయింగ్ గమ్ అమ్మకాలు నిలిపివేస్తే మంచిది. ఎందుకంటే లాక్ డౌన్ ఉన్నా, ప్రజలకు నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు కొంత సమయం ఇచ్చారు.  

 

నిత్యావసర వస్తువులు అమ్మే కిరాణా షాపులు, ఫ్యాన్సీ స్టోర్స్‌లో ఈ చూయింగ్ గమ్స్ ఉంటాయి. ఇక చూయింగ్ గమ్ నమలడం అలవాటు ఉన్నవాళ్ళు, అవి కొనకుండా ఉండరు. తర్వాత వారి నమిలేసి రోడ్ల మీదో, ఇంటి పరిసరాల్లోనో ఉమ్ముతారు. మామూలు వ్యక్తి చూయింగ్ గమ్ నమిలితే ఇబ్బంది లేదు గానీ, కరోనా ఉన్న వ్యక్తి నమిలి ఊస్తే సమస్య ఉంటుంది. కాబట్టి అన్నీ రాష్ట్రాలు చూయింగ్ గమ్స్‌పై నిషేధం విధిస్తే మంచిది.  

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: