ఒక పక్క దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజు కి ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా కేసులు ఉన్నా, మిగతా దేశాలతో పోల్చితే భారత్ లో పరిస్థితి కాస్త అదుపులోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయినా ముప్పు అయితే ఇంకా పూర్తి స్థాయిలో తప్పిపోలేదు. ఈ వైరస్ కు ఇప్పటి వరకు మందులు ఏవీ అందుబాటులో లేవు. ఈ వైరస్ సోకకుండా జనల మధ్య సామజిక దూరం పాటించడం ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న నివారణ మార్గంగా కనిపిస్తోంది. అందుకే కరోనా మరింత మందికి వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ను కేంద్రం అన్ని రాష్ట్రాల సహకారంతో సమర్ధవంతంగా అమలు చేస్తూ వస్తోంది. మార్చి 24 వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వ తేదీ వరకు మొత్తం 21 రోజులపాటు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. 

 

IHG


కాకపోతే లాక్ డౌన్ అమలు చేస్తున్న ఈ సమయంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటం, ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా ప్రజల్లో ఎక్కువ మంది దీనిని సీరియస్ గా తీసుకోకపోవడం, గుంపులు గుంపులుగా రోడ్లపైకి రావడం, కొన్ని కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విషయంలో సీరియస్ గా లేకపోవడం వంటి విషయాలపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపు జాతిని ఉద్దేశించి మాట్లాడబోతుండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎం లతో ప్రధాని కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక విషయాల గురించి చర్చించారు. 

 


ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్ తరువాత పరిస్థితి ఏంటి అనే దానిపై రూట్ మ్యాప్ సిద్ధం చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాల సీఎం లను ప్రధాని కోరారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ఓ చిన్న వీడియో సందేశాన్ని ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని ఏ విషయాలపై స్పందిస్తారో..? ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో అనే విషయాలపై ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: