దేశంలో కరోనాని నిర్మూలించే ప్రయత్నంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  దాంతో ఎక్కడి వారు అక్కడే ఇళ్లకు పరిమితం అయ్యారు.  ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని ఎంత చెబుతున్నా.. కొందరు వినడం లేదు. రోడ్ల మీదకొచ్చి విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. 

 

ఇదిలా ఉంటే గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి హేయమైన చర్య అని, వైద్యులపై ఎవరైన దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.  గురువారం మంత్రి తలసాని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందిస్తున్నారని, అలాంటి వైద్యులపై దాడికి పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఈ ఘటనపై వైద్యులతో మాట్లాడామని, గాంధీలో ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేశామని తెలిపారు.

మర్కజ్ ప్రాంతానికి వెళ్లి వచ్చిన వారిని గుర్తించామని, ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి తలసాని కోరారు. మరోవైపు వైద్యులపై దాడిని పోలీస్ శాఖ సీరియస్ తీసుకుంది. కుత్బుల్లాపూర్ చెందిన నలుగురిపై చిలకలగూడ పిఎస్ లో కేసు నమోదు చేశారు. దాడిచేసిన పేషెంట్ తో సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వైద్యులపై దాడి నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో పోలీసులు భద్రత పెంచారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: