తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారివే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇంకా ఎంత మంది డిల్లీకి వెళ్లి వచ్చారన్న అంశంపై తెలుగు రాష్ట్రాల యంత్రాంగం వేట ప్రారంభించింది. అయితే కొందరు మాత్రం తాము ఢిల్లీ లోని మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినా ఆ విషయం బయట పెట్టడం లేదు.

 

 

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇస్తిమాకు వెళ్లిన వారంద‌రిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచామ‌ని, అజ్ఞాతంలో ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా స‌మాచారం అందించి అధికారులకు సహకరించాలని నాయకులు విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా వంటి వారు కూడా అజ్ఞాతంలో ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా స‌మాచారం అందించి అధికారులకు సహకరించాలని చెబుతున్నా కొందరు ఏమాత్రం పట్టించు కోవడం లేదు.

 

 

ఇలాంటి వారి వల్ల సమాజంలో ఇంకా కరోనా వేగంగా ప్రబలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప జిల్లాలోని ఫాతిమా కళాశాలలో 200 మందిని ప‌రీక్షించ‌గా, ఒక్కరోజే 15 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ి. ఇంకా 25 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఆసుపత్రిలో అన్ని వ‌స‌తులు క‌ల్పించి సిబ్బంది కొర‌త లేకుండా చూశాస్తున్నారు. అవ‌స‌ర‌మైతే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

 

పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి వారంద‌రికీ నిత్యావ‌స‌ర వ‌స్తువులు డోర్ డెలివ‌రీ చేస్తున్నారు. కడప జిల్లాలో ఒక్కరోజే 15 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భ‌యాందోళ‌న‌కు గురువుతున్నార‌ు. ఇప్పటికే స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను మూసి వేశారు. ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా... ఇస్తెమాకు వెళ్లినవారి తగిన సమాచారం ఇచ్చిన క్వారంటైన్లకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటూ.. సమాజంలో తిరుగుతూ ఉంటే.. వారితో సమాజానికి పెను విపత్తు ఖాయంగా కనిపిస్తోంది.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: