సమాజం ఎలా పోతే నాకెందుకు ..? మేము, మా కుటుంబం బాగుంటే చాలు వున్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తుంటారు. ఎవరి స్వార్ధం వారు చూసుకునేవారు సమాజంలో చాలామంది ఉంటారు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా, విపత్తు సమయంలో మాత్రం జనాల్లో మార్పు రావాలి. తామే కాదు తమతో పాటు సమాజం మొత్తం బాగుండాలి అనుకునవే వారు కొంతమందే ఉంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ వైరస్ ను దేశం నుంచి తరిమి కొట్టేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తూ ప్రజలు ఈ వైరస్ భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంతవరకు బాగానే ఉన్నా... మాస్క్ ల నుంచి నిత్యావసర సరుకులు దగ్గర నుంచి అన్ని ధరలను ఎంతో కొంత పెంచి సొమ్ము చేసుకునే వారు క్రమంగా పెరిగిపోతున్నారు. 

 

IHG

ఇటలీలో తమ డబ్బు తమ ఆరోగ్యాన్ని కాపాడలేదంటూ కరెన్సీని రోడ్లపైకి విసిరేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు చక్కెర్లు కొడుతున్నాయి. అయినా భారత దేశంలో ఉన్న కుభేరుల్లో చాలామంది లో ఇంకా మార్పు రాలేనట్టుగా కనిపిస్తోంది. ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లో సుమారు 10 శాతం దేశ జనాభాకు సరిపడా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. భారత్ లో 130 కోట్లకు ఒక్కశాతమే వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స లో అత్యంత కీలకమైనది వెంటిలేటర్. ఆ వెంటిలేటర్ లు 80 వేల మందికి ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  ఇటలీ స్పెయిన్ వంటి దేశాల్లో కూడా వెంటిలేటర్ల కొరత ఎక్కువగా ఉంది. అయితే భారత్ లో అటువంటి పరిస్థితి వస్తే మా పరిస్థితి ఏంటి అనుకున్నారో ఏమో తెలియదు కానీ భారత కుబేరులు ముందుగానే అలెర్ట్ అయిపోయారు. 

 


ఇంతకీ వీరు ఏం ఘనకార్యం చేశారంటే... ? ఢిల్లీ లో కరోనా ప్రభావం మొదలు అవ్వకముందు ఒక వెంటిలేటర్ లు విక్రయించే వ్యాపారి వద్ద ఆరువేల వెంటిలేటర్ లు ఉండగా, వైరస్ వ్యాప్తి ఇండియాలో మొదలు అవుతుంటే ఇప్పుడు కేవలం 12 మాత్రమే అందుబాటులో ఉన్నాయంటే అంతా షాక్ అవుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వాలు కొనుగోలు చేయలేదు కానీ, కోట్లకు పడగలెత్తిన వారంతా వీటిని కొనుగోలు చేయడం ఇక్కడ గమనార్హం. ఇప్పుడు నిజంగా వెంటిలేటర్లు అవసరం వచ్చినా అందుబాటులో లేకపోవడం నిజంగా బాధాకరమే. ప్రభుత్వం ఈ విషయంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టి వాటిని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: