దేశం  లో  కరోనా విస్తృతికి కారణమైన నిజాముద్దీన్ లోని  మర్కజ్ మసీదు లో తబ్లీ జమాత్   ప్రార్థనల్లో పాల్గొన్న విదేశీయుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఈ ప్రార్థనల్లో  విదేశీయులను వీసాలను రద్దు చేస్తూ , ఈ కార్యక్రమానికి హాజరయిన 960  మంది విదేశీయుల పాస్ పోర్ట్ లను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది . పర్యాటక వీసాపై దేశంలోకి వచ్చి తబ్లీ జమాత్ కార్యక్రమం లో పాల్గొన్న విదేశీయులపై 1946 విదేశీ చట్టం , 2005  విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది .

 

కరోనా కట్టడికి లాక్ డౌన్ ప్రకటించడం ద్వారా , ఈ వ్యాధి విస్తృతిని అరికట్టగలిగామని కేంద్రం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి . అయితే ఈ  తరుణం లో వెలుగులోకి వచ్చిన మర్కజ్ మసీదు లో  తబ్లీ జమాత్ సమావేశ ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది .  విదేశాల నుంచి వచ్చిన వారిలో  మాత్రమే దేశ వ్యాప్తంగా అప్పటి వరకు  కరోనా  పాజిటివ్ లక్షణాలు కల్పించగా , తబ్లీ జమాత్ సమావేశాల అనంతరం స్థానికుల్లోను ఈ లక్షణాలు విరివిగా కన్పించాయి . దానికి ప్రధాన కారణం ఈ సమావేశాలకు కరోనా బాధితులైన విదేశీయులు హాజరుకావడం , వారితో దేశ నలుమూలన నుంచి వచ్చిన వారు కాంటాక్ట్ కావడమే ఈ వ్యాధి విస్తృతికి కారణమన్నది నిర్వివాదాంశం .

 

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి దేశం లో సామూహిక మతప్రార్ధనలను నిర్వహించిన వారిపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు . తబ్లీ జమాత్ సంస్థ అధినేత మౌలానా సాద్ తో పాటు మరో కొంతమంది పై కేసులు నమోదు చేసిన పోలీసులు, ఈ మేరకు  నోటీసులు   జారీ చేశారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: