కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్నే స్తంభింపజేసింది. ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక భారత్ విషయానికి వస్తే రెండు వారాలుగా లాక్‌డౌన్‌లోనే ఉండిపోయింది. ఇలాంటి సమయంలో రెక్కాడితే కానీ డొక్కాడని ప్రాణాలు ఆకలితో అల్లాడతాయి. ప్రభుత్వాలు ఆదాయాలు లేక నీరసపడిపోతాయి. కరోనా కట్టడి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది.

 

 

అందుకే అనేక కార్పొరేట్ కంపెనీలు తమ వంతుగా ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలు సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్‌ సంస్థలు ఏపీకి భారీ విరాళాలు ప్రకటించాయి.

 

 

తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కూడా తనవంతు సహాయాన్ని అందించింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు గాను సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. భారతి సిమెంట్స్‌ ఉద్యోగులు కూడా మరో 14.5 లక్షల విరాళాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి చెందిన కంపెనీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చిందన్నమాట.

 

 

ఇక వీటితో పాటు మరికొందరు కూడా విరాళాలు ప్రకటించారు. వర్షిని చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.1.10 కోట్లు విరాళం ప్రకటించింది. ఏపీ సీఎం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మైనింగ్‌ శాఖలు రూ. 200.11 కోట్లు విరాళం ప్రకటించాయి. ఏపీఎండీసీ రూ. 10.62 కోట్లు ఇచ్చింది. మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ రూ. 56 లక్షలు విరాళం ప్రకటించింది. ఉపాధి హామీ, వాటర్‌షెడ్‌ శాఖ రూ. 1.50 కోట్లు, సెర్ఫ్‌ఉద్యోగులు రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు.

 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: