మన దేశంలో గత రెండు రోజులుగా చాలా అత్యధిక మొత్తంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాయి. ఏప్రిల్ 14 తేదీ వరకు ఉన్న లాక్ డౌన్ మరొక పన్నెండు రోజుల్లో పూర్తి అవుతుంది అనగా ఇప్పటికే భారతదేశంలో ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 2000 దాటేసింది. దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది శాంపిల్స్ యొక్క ఫలితాలు రావలసి ఉండగా వారిలో ఎంతమంది పాజిటివ్ ఉంటారో.... వారి నుండి మరింత మందికి మహమ్మారి సోకి ఉన్నదో తెలియని పరిస్థితి.

 

ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న వైద్యులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ కుటుంబాల గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇంతటి త్యాగం చేస్తున్న డాక్టర్లకు అండగా ఉంటామని ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ భరోసా కల్పించారు. పగలనకా.... రాత్రనక కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుతున్న డాక్టర్లకు ఆర్థిక సహాయం ప్రకటించిన కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీలో ఆరుగురు వైద్యులు వైద్యం చేస్తూ కరోనా వైరస్ సోకి మరణించగా ఇప్పుడు అతను కొత్త విషయానికి శ్రీకారం చుట్టాడు.

 

కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా సోకిన వారికి వైద్య సహాయం అందిస్తూ మరణించిన వారికి కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇక, వైద్యులతో పాటు నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా జాబితా కిందికి వస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇది కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వారికి మాత్రమే కాదు ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా పని చేసే వారికి కూడా వర్తిస్తుందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: