కరోనా వైరస్ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలులోకి తెచ్చిన విషయం అందరికి తెలిసిందే. ముందు అంతర్ రాష్ట్రాల సరిహద్దులను మూసివేసిన రాష్ట్ర ప్రభుత్వాలు తరువాత మెల్లిమెల్లిగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో అంతర్ జిల్లాల సరిహద్దులను కూడా మూసివేశారు. ఇదిలా ఉండగా.. అసలు ప్రయాణికులకు వేరే జిల్లాకి వెళ్లాలంటేనే రకమైన రవాణా లేని పరిస్థితి. ఇక తమ సొంత వాహనాల్లో వెళ్దాం అంటే అడుగడుగునా పోలీసులు అడ్డుపడి వారిని వెనక్కి పంపేస్తున్నారు.

 

చివరికి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో లాక్ డౌన్ గడువును పొడిగించే అవకాశం లేదని తేల్చి చెప్పి ఏప్రిల్ 14 దానికి చరమగీతం పాడతామని స్పష్టం చేయగా.... తర్వాత ప్రజలు చాలా అప్రమత్తంగా బాధ్యతతో మెలగాలి అని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రెండు వారాలుగా నిలిచిపోయిన రైల్వే మరియు విమాన సర్వీసులు కూడా మళ్లీ ఊపందుకోనున్నాయి.

 

నేపథ్యంలో జాతీయ స్థాయిలో బుకింగ్ సర్వీసులను ఒకేసారిగా కాకుండా క్రమక్రమంగా పెంచుతామని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని జాతీయ పత్రిక ప్రచురించింది. అయితే అన్ని సర్వీసులు అదే రోజుల నుంచి ప్రారంభం కావని, క్రమంగా పెంచుతామని అధికారి చెప్పినట్లు తెలిపింది. మరోవైపు విమాన టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభం అయిపోయాయట.

 

ఇకపోతే ఏప్రిల్ 15 తేదీ నుండి లాక్ ఎత్తివేసి రైలు మరియు విమానాలు యధావిధిగా తిరగనున్నాయని తెలుస్తుంది. అయినా ప్రజలంతా కనీసం వాటి వైపు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే ఢిల్లీలోని ముస్లింల మీటింగ్ తర్వాత ఒక్కసారిగా రోజుకి 500 కేసులు బయటపడుతుంటే ప్రజలు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి తర్వాత రైళ్ళు మరియు విమానాలు తిరిగినా కూడా అవి ఖాళీగా తిరగాల్సిందే అని అందరూ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: