మనదేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తున్న వేళ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను దేశవ్యాప్తంగా చాలా సమర్థవంతంగా మరియు పటిష్టంగా అమలు చేస్తున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నా…. వైరస్ దెబ్బకు బయపడి ఇంటి నుండి బయటికి రావడమే మానేశారు. అందరూ తమ జీవితాలలో కరోనా అనే రెండు పదాలు మళ్లీ వినపడకూడదు అని దేవుడిని ప్రార్థిస్తూ ఉండగా అలాంటి భయాన్ని కలిగించే పేర్లను ఏకంగా తమ పుట్టిన పిల్లలకు పెట్టేశారు సదరు తల్లిదండ్రులు. అది కూడా ఎక్కడో కాదు మన భారతదేశంలోనే.

 

వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లో డియోరియా జిల్లాలోని ఒక గ్రామంలో మార్చి 30 ఒక బాబు పుట్టాడు. అయితే అతనికి వారి తల్లిదండ్రులు లాక్ డౌన్ అనే పేరు పెట్టారు. అతడు లాక్ డౌన్ సమయం లో పుట్టాడు కాబట్టి బాబుకి పేరు పెట్టారట. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ ప్రకటించారు. దేశ ప్రజల క్షేమం కోసం మోదీ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని మా బాబుకు పెట్టాం అని బాలుడి తండ్రి పవన్ చెప్పారు.

 

ఇకపోతే అదే రాష్ట్రంలో మరొకచోట మార్చి 22 రోజున యూపీలో గోరఖ్ పూర్ లోని ఒక పసిబిడ్డకు ఆమె మేనమామ నితీష్ త్రిపాఠి కరోనా అని పేరు పెట్టాడు. అది కూడా ఆమె ఆడపిల్ల కావడం గమనార్హం. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఐక్యం చేసిందని తెలిపాడు. అలాగే ఎన్నో మంచి అలవాట్లు కూడా నేర్పిందని చెప్పాడు. కరోనా అనే మహమ్మారి మీద పోరాటాన్ని బాలిక గుర్తు చేస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: