కరోనా దెబ్బ.. అమెరికా ఉద్యోగులంతా అబ్బా.. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ విళయతాండవం చేస్తుంది. దీంతో అమెరికాలో ఎంతోమంది ఉద్యోగాలు తీసేశారు.. ఇలా తీసెయ్యడంతో నిరుద్యోగ భృతి కోసం ఏకంగా మూడు వేలమంది దరఖాస్తు చేశారు. దీనికి కారణం కరోనా వైరసే. నిజానికి ప్రపంచంలో ఎక్కడ లేనన్ని కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదయ్యాయి. దీంతో కంపెనీలు అన్ని కూడా మూతపడ్డాయి. వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉద్యోగులు ఎటువంటి తప్పు చెయ్యకుండానే వారిని కంపెనీ ఉద్యోగం నుండి తీసి వేస్తే ప్రభుత్వం వారికీ ప్రతి వారం నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడా ఇంకో కొత్త విషయం ఏంటి అంటే ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థుతల కారణంగా ప్రభుత్వం ఉద్యోగం పోయిన వాళ్లే కాకుండా సొంత వ్యాపారం చేసుకునే వారిని, ఫ్రీ లాన్సర్లను కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది.  దీంతో ఉద్యోగం పోయిన వారు.. ఉద్యోగం లేని వారు ఇలా అనేకమంది నిరుద్యోగ భృతి దరఖాస్తు చేసుకున్నారు. 

 

దీంతో అమెరికా వ్యాప్తంగా 66 లక్షల మంది తాజాగా తమ మొదటి వారం నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసినట్టు లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. అయితే ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అని.. మరికొద్ది రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరి చివరికి అమెరికా పరిస్థితి ఎం అవుతుందో ఏమో.. 

 

 క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: