రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా వైరస్ తన వ్యాప్తితో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏ విధంగా కట్టడి చెయ్యాలని చూసినా సరే అది మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించడం తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు భయపడే పరిస్థితి వచ్చింది. అంతకంతకూ కరోన కేసులు పెరగడం తో ఇప్పుడు కేసీఆర్, జగన్ జాగ్రతలు పడుతున్నారు. 

 

కరోనా రోగుల విషయంలో ఇద్దరు కలిసి కొత్త ప్రణాలికను సిద్దం చెయ్యాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది అంత సులువు కాదు అనే అభిప్రాయానికి ముఖ్యమంత్రులు వచ్చినట్టే కనపడుతుంది. కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలకు అండగా ఉంటామని ప్రకటన చేసినా సరే ఇప్పుడు సిఎం లకు ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు. 

 

నాలుగు రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ లో కట్టడిలో ఉన్న కరోనా ఇప్పుడు ఒక్కసారిగా రెచ్చిపోవడం తో ఆందోళన మొదలయింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 150 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణా లో కూడా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తెలంగాణాలో తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు పెరగడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: