కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో ఇప్పుడు ప్రపంచం ఘోరంగా విఫలం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోన కేసులు ఇప్పుడు 10 లక్షలకు చేరువలో ఉన్నాయి. ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. రెండు లక్షల నుంచి పది లక్షలకు రావడానికి పది రోజులు పట్టింది అంతే. అంటే దీని ఆధారంగా చూస్తే ఇంకా వేగంగా కరోనా కేసులు పెరగడం ఖాయమని అంటున్నారు. 

 

ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, జర్మని, స్పెయిన్ దేశాలకు భవిష్యత్తులో కరోనా దెబ్బకు మరింత ముప్పు ఉంటుందని లాక్ డౌన్  ని అమలు చేసినా సరే కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది ఈ దేశాలకు సాధ్యం అయ్యే పని కాదనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపద్రవం ప్రపంచానికి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఈ రెండు వారాల్లో ప్రపంచం భవిష్యత్తు అర్ధమైపోతుందని, 

 

 

కరోనా వ్యాప్తి ని కట్టడి చేయడం అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలకు అంత సులువు కాదని భారీగా అన్ని దేశాల్లో మరణాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు పూర్తిగా కరోనా గుప్పిట్లో ఉందనే వాళ్ళు ఉన్నారు. దీన్ని కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకున్నా సాధ్యం కాదని మందు కనిపెట్టడం ఒక్కటే మార్గం అని పలువురు సూచిస్తున్నారు. మరి ఈ మందు ఎప్పుడు వస్తుందో.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: