క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని క‌మ్మేసి మ‌ర‌ణ మృందంగా చేస్తోంది. శుక్ర‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా బాధితులు 10 ల‌క్ష‌లు దాటేశాయి. క‌రోనా మ‌ర‌ణాలు 53 వేల‌కు చేరుకున్నాయి. ఇక ఇట‌లీ, అమెరికా, స్పెయిన్‌లో ఇప్ప‌టికే ఒక్కో దేశంలో క‌రోనా బాధితులు ల‌క్ష‌కు చేరుకున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కర‌నా మ‌ర‌ణాల్లో ఇట‌లీ, స్పెయిన్ దేశాల్లో స‌గం న‌మోదు అయ్యాయి. ఇక అగ్ర రాజ్య‌మై అమెరికాలో కరోనా మృత్యు విలయం సృష్టిస్తోంది.

 

ఓవైపు రోజురోజుకు వేల కొద్దీ కేసులు నమోదవుతుంటే.. వందలకొద్దీ ప్రజలు వైర్‌స్‌తో మరణిస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే 950 మందిపైగా చనిపోవడంతో.. గురువారంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 5 వేలు దాటింది. ఇటలీ, స్పెయిన్‌ తర్వాత 5 వేల మంది చనిపోయిన దేశం అమెరికానే. మ‌న దేశంలోనూ క‌రోనా క్ర‌మ‌క్ర‌మంగా పాకుతోంది. ఇప్ప‌టికే క‌రోనా బాధితులు 2500 కు చేరుకున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ‌లో 154 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. ఏపీలో 149 కేసులు న‌మోదు అయ్యాయి. 

 


ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం ఉద‌యం 7 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 15, 191

మృతుల సంఖ్య - 53, 180

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 2, 12, 035

యాక్టివ్ కేసుల సంఖ్య - 7, 49, 976

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 65, 215

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 2, 44, 877 - 6070

ఇట‌లీ - 1, 15, 242 - 13, 915

స్పెయిన్ - 1, 12, 065 - 10, 348
 

 

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 2543

మృతులు - 72

తెలంగాణ‌లో కేసులు - 154

గురువారం కేసులు - 27

తెలంగాణ మృతులు - 9

తెలంగాణ‌లో డిశ్చార్జ్ - 17

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 149

హ‌య్య‌స్ట్ కేసులు ఉన్న జిల్లా - నెల్లూరు (24) 

కొత్త కేసులు - 38

 

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: