ప్రపపంచ వ్యాప్తంగా కరోనా ఉగ్ర రూపం చూపిస్తుంది. ప్రపంచ దేశాలను ఇప్పుడు కరోన వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటేసింది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువలో ఉంది. అమెరికాలో కరోనా మరణాలు కూడా వేగంగా చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 79,747 మందికి కరోనా సోకింది. 

 

 

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 53 వేల మందికి పైగా మరణించగా నిన్న ఒక్క రోజే దాదాపు ఆరు వేల మంది ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అయితే కరోనా వైరస్ దాదాపుగా విలయ తాండవం చేస్తుంది. దీన్ని కట్టడి చేయడం ట్రంప్ ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది. అమెరికా సహా ఇటలీ, స్పెయిన్ దేశాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని అంటున్నారు. 

 

 

స్పెయిన్, ఇటలీ లో పది వేలు దాటాయి మరణాలు. ఇటలీ లో 14 వేలకు చేరువలో మరణాలు ఉన్నాయి. మన దేశంలో నిన్న ఒక్క రోజే 328 మందికి కరోనా వైరస్ సోకింది. 12 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పుడు కరోనా మరణాలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రపంచం మొత్తం కూడా కంగారు పడుతుంది. చాలా దేశాలు తమ పౌరులను ఏ విధంగా కాపాడుకోవాలో అర్ధం కాక నరకయాతన అనుభవిస్తున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: