ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుంచి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను కరోనా పంజా విసురుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలు జిల్లాలో ఒక కేసు నమోదు కాగా అనంతపురం జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. 
 
నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. ఈ మూడు జిల్లాలలో 20కు పైగా కేసులు నమోదు కావడంతో ఈ జిల్లాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రకాశం, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 
 
కడప జిల్లాలో 18 కేసులు నమోదు కాగా ప్రకాశం జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. విశాఖలో 11 కేసులు, తూర్పు గోదావరిలో 9 కేసులు, చిత్తూరు జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అత్యసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. 
 
ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. రోజురోజుకు ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెరుగుతూ ఉండటంతో కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ బయటకు వెళ్లినా మాస్కులు వినియోగిస్తూ కరోనా భారీన పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రజల నుంచి కరోనా నియంత్రణకు సహయసహకారాలు అందుతూ ఉండటంతో రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు పక్కాగా అమలవుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: