ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్ ఇవాన్ని అభివృద్ధి చెందిన దేశాలే. చాలా వరకు ప్రపంచం తో అన్ని దేశాలు కూడా పోటీ పడుతూ ఉంటాయి. కరోనా వైరస్ తో ఇప్పుడు పోరాడలేక చాతికిలపడుతున్నాయి. ఈ దేశాలు ఇప్పుడు కరోనా ఎలా చెప్తే అలా ఆడుతున్నాయి. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా ఈ దేశాలు బలపడిన దేశాలు. అయినా సరే ఇప్పుడు కరోనా దెబ్బకు ఈ దేశాలు చుక్కలు చూస్తున్నాయి. 

 

అభివృద్ధి చెందాయి అనుకున్న ఈ దేశాల్లో లోపాలు బయటపడుతున్నాయి.అమెరికాలో మూడు లక్షల మందికి కూడా పడకలు లేవు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అక్కడ వైద్య పరికరాల కొరత అనేది తీవ్రంగా ఉంది. ఇటలీ లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది, స్పెయిన్ అయితే చెప్పలేని పరిస్థితులు దాదాపుగా ఉన్నాయి. అభివృద్ధి చెందాం అని ప్రపంచం ముందు గొప్పలే గాని ఏమీ లేదు. 

 

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉంది ఈ దేశాల్లో పరిస్థితి. కరోనా వైరస్ అభివృద్ధి చెందని దేశాలు కట్టడి చేస్తున్నా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం కట్టడి చేయలేక తమ పౌరులను కోల్పోతున్నాయి. అమెరికాలో ఇటలీ లో వెంటిలేటర్ కొరత చాలా ఎక్కువగా ఉంది. అమెరికా అగ్ర రాజ్యం అయినా సరే మెడికల్ పరంగా ఎంత వెనుకబడి ఉందో అర్ధం చేసుకోవచ్చు. చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఇదే విధంగా వైద్య పరికరాల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: