ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తన ప్రజలకు ధైర్యం చెప్పలేని స్థితిలో ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఒకరకంగా విలయతాండవం చేస్తుంది. రాష్ట్రాన్ని కరోనా మేఘాలు క్రమంగా కప్పేస్తున్నాయి. కరోనా వైరస్ మేఘాలను తొలగించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కరోనా కట్టడి చర్యలు తీసుకోలేక రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. 

 

కరోనా వైరస్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్నా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటకు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పడం లేదు. ప్రజలను భయపడవద్దు అని ఆయన కోరడం లేదు. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా విషయంలో జగన్ ముందు నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా సరే ఆయన వచ్చి ధైర్యం చెప్పడం లేదు. జగన్ ఇప్పటి వరకు ధైర్యం గా మీడియా ముందుకి రాలేదు. 

 

ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసినా సరే ఆయన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు. కనీసం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. దీనిపై సొంత పార్టీలో కూడా అసహనం వ్యక్తమవుతుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత సైలెంట్ గా ఉండటం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి కూడా వాస్తవ పరిస్థితులను వివరించడం లేదని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: