కరోనా వైరస్ కు చైనా పుట్టినిల్లు అన్న సంగతి తెలిసిందే. అక్కడ వుహాన్ ప్రాంతంలో ఈ మహమ్మారి ప్రాణం పోసుకుని ప్రపంచాన్నే వణికిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత చైనా దాని వ్యాప్తిని అడ్డుకుంది. దాదాపు మూడు వేల మంది వరకూ చనిపోయారని చైనా చెబుతున్నా.. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ప్రపంచం భావిస్తోంది. అయితే ఇప్పుడు చైనాలో కొత్తగా కరోనా కేసులు పెద్దగా నమోదు కావడం లేదు.

 

 

అలా చైనా కరోనాను కట్టడి చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్తగా చైనాలో కరోనా కలకలం రేపుతోంది. డ్రాగన్‌ దేశం మళ్లీ కరోనా భయంతో ఉలిక్కిపడింది. హెనాన్‌ ప్రావిన్స్‌లోని జియా ప్రాంతంలో తాజాగా ఓ మహిళకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో చైనా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఆ ప్రాంతం జనాభా సుమారు 6 లక్షలు. అంతే.. ఆ ప్రాంతంలో ఉన్నపళంగా చైనా సర్కారు లాక్‌డౌన్‌ విధించింది.

 

 

కరోనా మళ్లీ దేశంలో విజృంభించేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని చైనా భావిస్తోంది. అందుకే కేవలం కొత్తగా ఒక్క కేసు నమోదైనా సరే.. దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు సిద్ధమైంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది.. మొదట్లో రోజూ వందల్లో వెలువడిన కేసులు ఇప్పుడు వేలకు చేరుకుంటున్నాయి. గురువారం అర్ధరాత్రికి ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 10 లక్షల మార్కును చేరుకుంది.

 

 

ఒక్క యూరప్‌లోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు పలు దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రపంచంలోని మానవాళిలో సగం మంది లాక్ డౌన్ ద్వారా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాతో బాధపడుతూ ఇప్పటివరకూ 187 దేశాల్లో మరణించినవారి సంఖ్య 50 వేలు దాటింది.

 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: