క‌రోనా వైర‌స్ వ్యాప్తి విజృంభిస్తున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం ఉద‌యం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దేశానికి సందేశం ఇవ్వ‌నున్నారు. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఎం చెప్ప‌బోతున్నారు..? అన్న‌ది అంద‌రిలో ఉత్కంఠ రేపుతోంది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. మొద‌టి సారి మాట్లాడుతూ.. మార్చి 22న‌ జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించాల‌ని పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌రోసారి మాట్లాడుతూ.. ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి శుక్ర‌వారం ఉద‌యం 9గంట‌ల‌కు ఆయ‌న మ‌ట్లాడ‌నున్నారు. ఈనేప‌థ్యంలో ప్ర‌ధాని ఎలాంటి సందేశం ఇవ్వ‌బోతున్నారు..? అన్న‌దానిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దేశంలో రోజురోజుకూ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెరుగుతుండ‌గా ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారా..?  లాక్‌డౌన్‌ను మ‌రికొన్ని రోజులు పొడిగిస్తారా..? అన్న ప్ర‌శ్న‌లు జ‌నంలో ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

 

అయితే.. గురువారం రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావంపై ఆయ‌న వివ‌రాలు సేక‌రించారు. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రుల‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాల్లో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ముఖ్య‌మంత్రులు మోడీకి వివ‌రించారు. అయితే.. వీడియో కాన్ఫ‌రెన్స్ మ‌రునాడే.. దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోడీ సందేశం ఇస్తుండ‌డంతో ఏదో కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. ప్ర‌తీసారి రాత్రి 8గంట‌ల‌కు దేశానికి సందేశం ఇచ్చే ప్ర‌ధాని మోడీ.. ఈసారి మాత్రం ఉద‌యం 9గంట‌ల‌కు సందేశం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ఉదంతం త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. ఇప్ప‌టివ‌ర‌కు 2063 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 156మంది వైర‌స్ బారి నుంచి కోలుకోగా.. 53మంది మ‌ర‌ణించారు. ఈ గ‌ణాంకాల‌తో ప్ర‌జ‌ల్లోనూ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. త‌బ్లిఘి ఘ‌ట‌న త‌ర్వాత‌

 

మరింత సమాచారం తెలుసుకోండి: