కరోనా దెబ్బకు ఇప్పుడు దేశం భయపడిపోతుంది. కరోనా తగ్గిపోయింది అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు దీని ప్రభావం చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో కరోనా పరిక్షలు అనేది ప్రభుత్వాలు జరపడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి ఇప్పుడు. 

 

కరోనా వైరస్ ని కట్టడి చేయాలి అంటే ఇప్పుడు పూర్తిగా పరిక్షలు జరపాలి. ఆ లక్షణాలు ఏ విధంగా బయటపడుతున్నాయో ఎవరికి అర్ధం కావడం లేదు. ఆ లక్షణాలను అర్ధం చేసుకోవడం కూడా వైద్యులకు ఒక్కో సారి అర్ధం కావడం లేదు. కరోనా అనేది మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తూ వస్తుంది. అయినా సరే మన దేశంలో పూర్తి స్థాయిలో పరిక్షలు మాత్రం జరగడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో భయపడుతున్నాయని కేసులు పెరిగితే వైద్యం కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని అందుకే పరిక్షల విషయంలో ఇప్పుడు ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయంలో అలసత్వం ఏ విధంగా ప్రదర్శించినా సరే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కాబట్టి ప్రభుత్వాలు పరిక్షలు ఎక్కువగా చెయ్యాల్సి ఉంటుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: